జనవిజయంజాతీయండిజిటల్ చెల్లింపుల్లో భారత్ వృద్ధి

డిజిటల్ చెల్లింపుల్లో భారత్ వృద్ధి

న్యూఢిల్లీ, మే 18 (జనవిజయం): డిజిటల్ చెల్లింపులు దేశంలో బహుళ ప్రాచుర్యంలోకి ఉవచ్చాయి. అందులోనూ కొవిడ్ మహమ్మారి కాలంలో అవి ఎంతో పెరిగాయి. 2020 సంవత్సరంలో దేశం డిజిటల్ చెల్లింపుల విభాగంలో చైనా, అమెరికాను కూడా దాటుకుని కొత్త ప్రపంచ రికార్డులు నెలకొల్పింది. గత ఏడాది భారతదేశంలో 2550 కోట్ల వాస్తవిక ఆన్‌లైన్ లావాదేవీలు నమోదయ్యాయి. ఆన్‌లైన్ లావాదేవీల సంఖ్యలో 15,700 కోట్లతో చైనా, 600 కోట్లతో దక్షిణ కొరియా, 520 కోట్లతో థాయ్‌లాండ్, 280 కోట్లతో బ్రిటల్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. కేవలం 120 కోట్ల లావాదేవీలతో అమెరికా అతి కష్టంగా టాప్ 10లో స్థానం సంపాదించుకోగలిగింది.

ఒకవిధంగా చెప్పాలంటే, పాత పెద్ద నోట్ల ర‌ద్దు అనంత‌రం భార‌త్‌లో డిజిటల్ పేమెంట్‌లు బాగా పెరిగాయి. ఈ క్ర‌మంలోనే చాలా డిజిట‌ల్ పేమెంట్ సంస్థ‌లు అందుబాటులోకి రావ‌డంతో ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున డిజిటల్ చెల్లింపుల‌కు మొగ్గ‌చూపారు. ఇక ప్ర‌భుత్వం కూడా ఆన్‌లైన్ ఆర్థిక కార్య‌క‌లాపాల‌ను ప్రోత్స‌హించిన విష‌యం కూడా విధిత‌మే. అయితే పాత నోట్ల ర‌ద్దు స‌మ‌యంలో జ‌రిగిన ఆన్‌లైన్ పేమెంట్స్‌తో పోలిస్తే ప్ర‌స్తుతం కోవిడ్ స‌మ‌యంలోనే డిజిట‌ల్ పేమెంట్స్ ఎక్కువ‌గా పెరిగిన‌ట్లు తాజా గ‌ణంకాలు చెబుతున్నాయి.

గ‌తంతో పోలిస్తే క‌రోన స‌మ‌యంలో దేశవ్యాప్తంగా డిజిటల్‌ పేమెంట్స్‌తో పాటు ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ కార్యకలాపాలు భారీగా పెరిగాయి. ఈ విషయాన్ని ఇటీవల నాబార్డు నివేదిక వెల్లడించింది. దేశంలో డిజిటల్‌ చెల్లింపులు నిరంతరం అభివృద్ధి చెందుతుండగా కోవిడ్‌ నేపథ్యంలో ఇప్పుడు క్యూఆర్‌ కోడ్‌లను అనుమతిస్తుండటంతో రిటైల్‌ చెల్లింపుల విభాగంలో కూడా యూపీఐ చెల్లింపులు మరింత పెరుగుతాయని నాబార్డ్‌ నివేదికలో పేర్కొంది. స్మార్ట్‌ ఫోన్లు అందుబాటులోకి రావ‌డంతో డిజిటల్‌ పేమెంట్స్‌ పెరుగుతున్నాయని, గ్రామీణ ప్రాంతాలకు కూడా ఆన్‌లైన్‌ చెల్లింపులు విస్తరిస్తున్నాయని నాబార్డ్ వివ‌రించింది. లాక్‌డౌన్ స‌మ‌యంలోనూ ఆన్‌లైన్ చెల్లింపులు బాగా పెరిగాయని తేలింది. నాబార్డ్ అందించిన నివేదిక ప్ర‌కారం, 2019 డిసెంబర్‌లో జరిగిన యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) లావాదేవీలతో పోలిస్తే 2020 అక్టోబర్‌లో జరిగిన లావాదేవీల సంఖ్యలో 58.33 శాతం, లావాదేవీల విలువలో ఏకంగా 90.68 శాతం వృద్ధి నమోదయ్యాయి.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి