భద్రాద్రి కొత్తగూడెం, జూలై 15(జనవిజయం) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన కలెక్టర్ గా ప్రియాంక అల శనివారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత కలెక్టర్ అనుదీప్ హైదరాబాద్ కలెక్టర్ గా బదిలీ అయిన విషయం విదితమే. 2016 బ్యాచ్ కి చెందిన ఐఏఎస్ అధికారిని ప్రియాంక అల హైదరాబాద్ గ్రేటర్ మున్సిపాలిటీ లో అదనపు కలెక్టర్ గా పనిచేస్తూ బదిలీ పై కొత్తగూడెం కలెక్టర్ గా వచ్చారు. నూతన కలెక్టర్ కు జాయింట్ కలెక్టర్ కె వెంకటేశ్వర్లు, జిల్లా పౌర సంబంధాల అధికారి శ్రీనివాసరావు పుష్ప గుచ్చం అందజేసి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమం లో ఏవో గణ్యా, కలెక్టరేట్ పర్యవేక్షకులు అనంత రామకృష్ణ, వివిధ మండలాల తహశీల్దార్లు నాగరాజు, కృష్ణ ప్రసాద్, కృష్ణవేణి, సీసీ దినేష్ పాల్గొన్నారు.