- పురుషులు : 4,54,286 మంది స్త్రీలు : 474663 మంది
భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్ట్ 21 (జనవిజయం): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం 9,28,983 మంది ఓటర్లు ఉన్నట్లు సోమవారం ఒక ప్రకటన లో కలెక్టర్ ప్రియాంక తెలిపారు. జిల్లా ముసాయిదా ఓటర్ల జాబితాను ఆమె ప్రకటించారు. ముసాయిదా ఓటరు జాబితాలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియచేయాలని సూచించారు. ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు జిల్లాలోని ఐదు నియోజకవర్గాలైన పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం నియోజక వర్గాలలో మొత్తం 928983 మంది ఓటర్లున్నట్లు చెప్పారు. వీరిలో పురుషులు 454286 మంది, స్త్రీలు 474663 మంది, థర్డ్ జండర్స్ 34 మంది, ఎన్నారైలు 42 మంది, సర్వీస్ ఓటర్లు 731 మంది ఉన్నట్లు చెప్పారు.
ముసాయిదా ఓటరు జాభితాను ప్రతి ఓటరు పరిశీలించి అబ్యఅంతరాలు, తప్పోప్పుల సవరణ, లిస్టులో ఉన్నటు వంటి పేర్లపై ఆక్షేపణలు తెలపడానికి సెప్టెంబర్ 19 వరకు గడువు ఉన్నట్లు చెప్పారు. నిర్దేశించిన సమయంలోగా వచ్చిన ఆక్షేపణలను విచారణ నిర్వహించి సెప్టెంబర్ 28 వరకు పూర్తి చేసి అక్టోబర్ 4న తుది ఓటరు జాబితాను ప్రకటించడం జరుగుతందని తెలిపారు. సోమవారం జారీ చేసిన ముసాయిదా ఓటరు జాబితాను పరిశీలించి
నూతన ఓటరు నమోదుకు ఫారం-6, తప్పోప్పుల సవరణకు ఫారం-8, ఓటరు జాబితాలోని పేర్ల పై ఆక్షేపణలు, వలస వెళ్లిన, మరణించిన వారి వివరాలు తెలపడానికి ఫారం-7 ను వినియోగించాలని కలెక్టర్ పేర్కొన్నారు.