- అమెరికాలో జరిగే సెమినార్ కి ప్రత్యేక ఆహ్వానం
భద్రాచలం, సెప్టెంబర్ 01 (జనవిజయం): ద్రాచలం పట్టణం కు చెందిన డాక్టర్ క్రాంతి కుమార్ కు అరుదైన గౌరవం దక్కింది. అక్టోబర్ నెలలో అమెరికాలో జరిగే కార్డియాక్ సెమినార్ కి ప్రత్యేక ఆహ్వానం అందింది.
వివరాలకు వెళ్తే భద్రాచలం లోని ప్రముఖ వ్యాపార, రాజకీయ వేత్త, సంఘ సేవకులు గేదెల శివశంకర్ రావు, ప్రభావతి (మాజీ జడ్పీటీసీ ) దంపతుల కుమారుడైన డాక్టర్ క్రాంతి కుమార్ కేరళ రాష్ట్రంలోని అమృత మెడికల్ కాలేజీలో కార్డియాక్ (డి ఎమ్)ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. ఈ నేపథ్యంలో గుండెకి సంబంధించిన అనేక అంశాలపై వివిధ ప్రాంతాలలో వివిధ మెడికల్ క్యాంపస్ ల్లో జరిగే సెమినార్ లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యం లో అక్టోబర్ నెల చివరలో అమెరికాలోని కాలిఫోర్నియా లో జరిగే సెమినార్ కి ప్రత్యేక ఆహ్వానం అందుకున్నారు. అరుదైన గౌరవాన్ని దక్కించుకున్న డాక్టర్ క్రాంతి కుమార్ ని పట్టణ ప్రముఖులు తోటి వైద్యులు అభినందిస్తున్నారు.
గతంలో డాక్టర్ క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో భద్రాచలం ఏజెన్సీ ప్రజలకు అనేక సందర్భాలలో ఉచిత మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి పేదలకు వైద్యం అందించిన విషయం తెలిసిందే !అంచెలు అంచెలుగా ఎదుగుతున్న క్రాంతి కుమార్ మరెన్నో విజయాలను అందిపుచ్చుకోవాలని భద్రాచలం వాస్తవ్యులు కోరుతున్నారు.