భద్రాచలం ప్రాంత అభివృద్ధిని దహనం చేసింది బిఆర్ఎస్ పార్టీ నే
- అభివృద్దే ధ్యేయంగా పని చేస్తున్న నాపై బురద చల్లితే ఊరుకునే ప్రసక్తే లేదు
- ఎమ్మెల్యే పొదేం వీరయ్య
భద్రాచలం, జూలై 25 (జనవిజయం):
భద్రాచలం ప్రజలను అబద్ధపు హామీలతో పచ్చిగా మోసం చేసింది బిఆర్ఎస్ ప్రభుత్వమే నని ఎమ్మెల్యే పోదేం వీరయ్య ఆరోపించారు. స్థానిక బిఆర్ఎస్ నాయకులు ప్రజా సమస్యల గురించి పోరాడుతున్న తనపై నిందలు మోపితే సహించేదే లేదని ఆయన హెచ్చరించారు. మంగళవారం తన కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో వీరయ్య మాట్లాడుతూ
ఇచ్చిన హామీలు, ప్రభుత్వం ఇచ్చిన నిధులు గురించి సీఎం కేసీఆర్ తో చర్చించేందుకు తాను సిద్ధం గా ఉన్నానని పేర్కొన్నారు. బాధ్యతగా నాతో వచ్చేందుకు జిల్లా బిఆర్ఎస్ మంత్రి కి గాని, ఈ ప్రాంత ఎంపీ కి గాని బీఆర్ఎస్ నాయకులకు గాని దమ్ము ,ధైర్యం ఉందా అని ఆయన ప్రశ్నించారు. తొలుత ఎమ్మెల్యే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ *”కోరం కనకయ్య, నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు డాక్టర్ తెల్లం వెంకట్రావు ల తో కలిసి భద్రాచలం పట్టణ గోదారి కరకట్ట ప్రాంతం లో వరద ను పరిశీలించారు. ఇరిగేషన్ శాఖ ఊర్లోని మురుగు నీటిని స్లూఇజ్ నుండి మోటార్ల ద్వారా గోదావరి నదిలోకి లిఫ్ట్ చేస్తున్న విధానాన్ని కూడా వారు పరిశీలించారు.
ఎగువ ప్రాంతాల్లో పడుతున్న వర్షాలు, పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వల్ల భద్రాచలం ప్రాంతానికి ఎంత వరకు వరద నీరు చెరవచ్చుననీ అధికారులు ను అడిగి తెలుసుకున్నారు.అనంతరం స్థానిక నన్నపనేని మోహన్ హైస్కూల్లో ఏర్పాటుచేసిన వరద బాధితుల పునరావాస కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ ప్రజలకు అందుతున్న వసతుల గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. విలేకరుల సమావేశం లో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం భద్రాచలం ప్రాంతాన్ని పూర్తిగా విస్మరించిందని అన్నారు.
100 కోట్లు, 1000 కోట్లు అంటూ అబద్ధపు హామీలతో ఇక్కడి ప్రాంత ప్రజలను గోదావరి వరదల్లో ముంచిందని విమర్శించారు
భద్రాచలం బిఆర్ఎస్ నాయకులు ప్రతిపక్ష ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దహనం చేస్తున్నారంటే, ప్రజల సమస్యల గురించి కెసిఆర్ ని అడిగే దమ్ము ధైర్యం లేకనే ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నారని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు.
భద్రాచలం పట్టణం ఈరోజు 40 అడుగులకే మునిగిపోయే పరిస్థితి వచ్చింది అంటే అది టిఆర్ఎస్ ప్రభుత్వ ఘనత గా ఆయన ఆరోపించారు. బిఆర్ఎస్ నాయకులకు, బిఆర్ఎస్ మంత్రులకు భద్రాచలం ప్రాంతం పైన గాని ఇక్కడ ప్రజల పైన గాని బాధ్యత లేదని అన్నారు. కేవలం కళ్లబొల్లి మాటలు చెబుతూ షో రాజకీయాలు చేసేందుకే ఈ ప్రాంతానికి వస్తున్నారని అన్నారు.
జిల్లా మంత్రిగా ఉన్న పువ్వాడ అజయ్ కుమార్ ఇక్కడే పుట్టా, ఇక్కడే పెరిగాని చెప్పుకోవడమే తప్ప ఈ ప్రాంతానికి చేసిందేమిటి అని ఆయన ప్రశ్నించారు. వరదల టైంలో వచ్చి షో చేయటం తప్ప ఇక్కడ ప్రజలు పడుతున్న సమస్యల గురించి సీఎం దృష్టికి తీసుకెళ్లడంలో ఆయన విఫలమయ్యారని అన్నారు.
భద్రాచలం ప్రాంత సమస్యల శాశ్వత పరిష్కారం కోసం సీఎం తో చర్చించేందుకు తాను సిద్దం గా ఉన్నానని, తనతో పాటు బాధ్యత గల మంత్రి వస్తారా లేదా ఎంపీ గారు వస్తారా, లేదా ఇక్కడ బిఆర్ఎస్ నాయకులు వస్తారా? చెప్పండి అంటూ ఎమ్మెల్యే నిలదీశారు.భద్రాచలం నియోజకవర్గం ప్రజలు బిఆర్ఎస్ పార్టీ చెప్పే కల్లిబొల్లి మాటలు,కపట నాటకాలను ప్రజలు గమనిస్తున్నారని, రానున్న ఎన్నికల్లో సరైన బుద్ధి చెప్పేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సరెళ్ళ నరేష్, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు చింతరేల రవికుమార్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు బోగాల శ్రీనివాస్ రెడ్డి, బంధం శ్రీనివాస్ గౌడ్, సరెళ్ళ వెంకటేష్, యూత్ కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు చింతిరేల సుధీర్,యూత్ కాంగ్రెస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎడారి ప్రదీప్,రాస మల్ల రాము,ఎండి నవాబ్, తోకల ప్రసాద్,శివ,పవన్,కొత్త శ్రీను,మహిళా కాంగ్రెస్ నాయకులు పందాల సరిత, పుట్ట జానకీరాణి, గౌరీ తదితరులు పాల్గొన్నారు.