వరద ప్రాంతాల పర్యటనకై భద్రాచలం చేరుకున్న మంత్రి పువ్వాడ
భద్రాచలం, జులై 21 (జనవిజయం):
వరదల నేపథ్యంలో సహాయక చర్యలను పరిశీలించేందుకు ముఖ్యమంత్రి కేసీయార్ ఆదేశాలమేరకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శుక్రవారం భద్రాచలం చేరుకున్నారు.
ఈ సందర్భంగా ITC గెస్ట్ హౌస్ లో మంత్రి పువ్వాడ ను జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా, వరదల ప్రత్యేక అధికారులు కృష్ణ ఆదిత్య, గౌతం పోట్రు, కృష్ణ ఆదిత్య, ITDA పిఓ పోప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ వినీత్, ASP అరితోష్ పంకజ్ తదితరులు మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు.
మరికాసేపట్లో గోదావరి కరకట్ట పై వరద ఉధృతిని భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, పినపాక ఎంఎల్ఏ రేగ కాంతారావు తో కలిసి జిల్లా అధికారులతో మరి కాసేపట్లో సమీక్ష నిర్వహించనున్నారు.