- బిఆర్ఎస్ ను ప్రశ్నించిన కాంగ్రెస్ నేత బుడగం
భద్రాచలం, జూలై 18(జన విజయం):
భద్రాచలం అభివృద్ధికి ఏమాత్రం కృషి చేయని బి అర్ ఎస్ ప్రభుత్వం ఎమ్మెల్యే పోదేం వీరయ్య ను విమర్శించడం ఏమిటని పిసిసి సభ్యులు బుడగం శ్రీనివాస్ ప్రశ్నించారు. నిత్యం ప్రజల మధ్య ఉంటున్న పొదెం వీరయ్య పై విమర్శలు తగవని ఆయన అన్నారు.* స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బుడగం శ్రీనివాస్ మాట్లాడుతూ భద్రాచలం అభివృద్ధిపై స్థానిక అధికార పార్టీ నాయకులకు, మంత్రికి గాని ఏమాత్రం చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. సీఎం కేసీఆర్ భద్రాచల ప్రాంతానికి ఇచ్చిన హామీలపై ఏ రోజైనా ముఖ్యమంత్రి నీ కలిసెరా అని ఆయన ప్రశ్నించారు. 100 కోట్లు,1000 కోట్లు నిధులు విడుదల చేపించుట లో బి అర్ ఎస్ నాయకులు ఎందుకు చొరవ చూపలేదని ఆయన అన్నారు. భద్రాచలం ప్రాంతం నుంచి విడిపోయిన ఐదు పంచాయతీలను తిరిగి భద్రాచలంలో కలపాలని, అభివృద్ధి కీ నిధులు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయమై పలు పర్యాయాలు అసెంబ్లీ లో ఎమ్మెల్యే పొదెం వీరయ్య ప్రస్తావించారు అని ఆయన గుర్తు చేశారు. ఐదు పంచాయతీలను భద్రాచలంలో తిరిగి కలపాలని రాష్ట్రపతి ని,గవర్నర్ స్థానిక ఎమ్మెల్యే పొదెం వీరయ్య కలిసి నట్లు తెలిపారు. దఉన్న పంచాయతీని మూడు పంచాయతీలుగా విడగొట్టాలని చూస్తున్నారు.స్థానిక ఎమ్మెల్యేకి ఇవ్వాల్సిన నిధులను నిలిపివేసి భద్రాచలం ప్రాంత అభివృద్ధిని అడ్డుకుంటుంది మీరు100 కోట్లు,1000 కోట్లు హామీలు ఇచ్చి ప్రజలను మభ్య పెట్టటం అబద్ధపు హామీలు ఇవ్వడం స్థానిక ప్రజలు గమనిస్తున్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు కాబట్టే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయవలసి వచ్చింది. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం రామలయ అభివృద్ధి కి, భద్రాచలం నియోజకవర్గ అభివృద్ధిపై ఎన్ని పోరాటాల కైనా, తాము సిద్ధం అని అన్నారు. గ్రామపంచాయతీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించలని ఆయన డిమాండ్ చేశారు ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు భోగాల శ్రీనివాస్ రెడ్డి, నరేష్, దొడ్డిపట్ల సత్య లింగం, సరెళ్ళ వెంకటేష్, యూత్ కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు చింటిర్యాల సుదీర్, యూత్ కాంగ్రెస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ యాడారి ప్రదీప్, తదితరులు పాల్గొన్నారు.