జనవిజయంజాతీయంబెంగాల్లో రాజకీయ కలకలం

బెంగాల్లో రాజకీయ కలకలం

నారద స్టింగ్ ఆపరేషన్‌లో ఇద్దరు మంత్రుల అరెస్ట్‌
సిబిఐ కార్యాలయం ముందు నిరసనకి దిగిన సిఎం మమత
కార్యాయంపైకి రాళ్లు రువ్విన టిఆఎంస్‌ కార్యకర్తలు
కఠిన చర్యలు తీసుకోవాలని కోరిన గవర్నర్‌ ధన్‌కర్‌

కోల్‌కతా,మే17(జనవిజయం): వెస్ట్‌ బెంగాల్‌ లో అధికారంలోకి వచ్చాక తొలిసారి మమత బెనర్జీకి షాక్‌ తగిలింది. ఇద్దరు మంత్రులను సీబీఐ అదుపులోకి తీసుకుంది. నారద స్టింగ్‌ ఆపరేషన్‌లో భాగంగా.. సోమవారం ఉదయం 9 గంటలకు మంత్రి ఫిర్మాద్‌ హకీమ్‌ ఇంటికి కేంద్ర బలగాలు వెళ్లాయి. అతడిని అదుపులోకి తీసుకున్నాయి. మరో మంత్రి సుబ్రతా ముఖర్జీని కూడా సీబీఐ అదుపులోకి తీసుకుంది. దీంతో ఒక్కసారిగా రాష్ట్రంలో కలకలం రేపింది. ఈ విషయం తెలుసుకున్న సీఎం, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమత బెనర్జీ ఫైర్‌ అయ్యారు. కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. వెంటనే సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారు. తనను కూడా అరెస్టు చేయాలని ఆమె డిమాండ్‌ చేశారు. మరోవైపు తృణమూల్‌ ఎమ్మెల్యే మదన్‌ మిత్రా, ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ మేయర్‌ సోవన్‌ ఛటర్జీ నివాసాలకు కూడా కేంద్ర బలగాలు చేరుకున్నాయి. 2016 ఎన్నికల సమయంలో నారద న్యూస్‌ స్టింగ్‌ ఆపరేషన్‌ చేపట్టింది. కెమెరా ముందు పలువురు డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఓ వ్యాపారవేత్త నుంచి నలుగురు ఎంపీలు, నలుగురు మంత్రులు, ఓ ఎమ్మెల్యే డబ్బు తీసుకుంటున్నట్లు వీడియోలు బయటకు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడం ప్రారంభించింది. స్టింగ్‌ ఆపరేషన్‌లో విచారణ చేయాలని ఇటీవలే బెంగాల్‌ గవర్నర్‌ జగదీప్‌ ధన్‌ఖర్‌ విచారణ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. స్పెషల్‌ కోర్టులో చార్జ్‌షీట్‌ సీబీఐ దాఖలు చేసింది. మొత్తం నలుగురిని అరెస్ట్‌ చేయడం బెంగాల్‌లో రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. అధికార పార్టీకి చెందిన మంత్రిని సీబీఐ అధికారులు అరెస్ట్‌ చేయడంతో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాటు టీఎంసీ కార్యకర్తలు కూడా సీబీఐ ఆఫీసు ముందు నిరసన వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ ఓటమిని జీర్ణించుకోలేక పోతోందని, అందుకే తమ నేతలను అరెస్టు చేసి పగ తీర్చుకుంటోందని టీఎంసీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. మంత్రి ఫిర్హాద్‌ హకీంను, ఇతర నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. నారద కుంభకోణం కేసులో పశ్చిమ బెంగాల్‌ మంత్రి ఫిర్హాద్‌ హకీంను సీబీఐ అధికారులు అరెస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఫిర్హాద్‌ హకీం… మమతా బెనర్జీ కేబినెట్‌లో రవాణాశాఖ మంత్రి. ఫిర్హద్‌తోపాటు ఈ కేసులో నేతలు మదన్‌ మిత్రా, సుబ్రతా ముఖర్జీ, సోవన్‌ చటర్జీలపై అనేక ఆరోపణలు ఉన్నాయి. ఈ ఉదంతంలో అప్పటి తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత, నేటి బీజేపీ ఎమ్మెల్యే సువేందు అధికారిపై విచారణకు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా అనుమతినిచ్చారు. నగరంలోని సీబీఐ ఆఫీసు దగ్గర టీఎంసీ కార్యకర్తలు నిరసనలపై రాష్ట్ర గవర్నర్‌ జగదీప్‌ ధన్‌ఖర్‌ స్పందించారు. సీబీఐ కార్యాలయంపై రాళ్ల దాడిని ఆయన ఖండిరచారు. ఇంత జరుగుతున్నా పోలీసులు ప్రేక్షకుల్లా నిలిచిపోయారని వ్యాఖ్యానించారు. అక్కడి శాంతిభద్రతలను పునరుద్దరించాల్సిందిగా పోలీసులను గవర్నర్‌ కోరారు. ఈ నేపథ్యంలో కొంతమంది టీఎంసీ కార్యకర్తలు రాళ్లదాడి చేయడం ఉద్రిక్తతకు దారితీసింది.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి