Thursday, March 28, 2024
HomeUncategorizedగ్రామపంచాయతీ ఈవో పై ఆగ్రహం వ్యక్తం చేసిన పొదెం వీరయ్య

గ్రామపంచాయతీ ఈవో పై ఆగ్రహం వ్యక్తం చేసిన పొదెం వీరయ్య

ప్రజలకు ఇబ్బంది కలగకుండా చెత్తను వేరే చోట  వెయ్యాలని గ్రామపంచాయతీ అధికారులను ఆదేశించిన MLA పొదేం వీరయ్య

ప్రజల ఆరోగ్యం అంటే అంత అలుసా!

గ్రామపంచాయతీ ఈవో పై ఆగ్రహం వ్యక్తం చేసిన పొదెం వీరయ్య

భద్రాచలం, ఏప్రిల్ 21(జనవిజయం) : రామాలయ పరిసర కరకట్ట ప్రాంతాల్లో చెత్తని వేసి కాల్చడం వల్ల తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నామని.అక్కడి ప్రాంత ప్రజలు భద్రాచలం శాసనసభ్యులు పొదెం వీరయ్య దృష్టికి తీసుకురాగా శుక్రవారం ఉదయం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు “సరెళ్ళ నరేష్” ని వెంట తీసుకొని ఆ ప్రాంతానికి వెళ్లి పర్యవేక్షించి పంచాయతీ అధికారుల తీరు పై ఆగ్రహం వ్యక్తం చేసారు.

         భద్రాచల పుణ్యక్షేత్రం  రామాలయ కరకట్ట పరిసర ప్రాంతాలలో పంచాయతీ అధికారులు చెత్త వేసి దానిని కాల్చడం వల్ల భద్రాచల పట్టణం మొత్తం కాలుష్యానికి గురై ముదిరాజ్ బజార్, చట్టాదిగువ, శిల్పినగర్ ఏరియా ప్రాంతం వారు ఈ చెత్త నుండి వచ్చే కాలుష్యానికి ప్రతిరోజు చాలా ఇబ్బందికర వాతావరణం నెలకొనడం వల్ల ఊపిరితిత్తుల సమస్యలు ఇతర శ్వాసకోశ సమస్యలు ముసలివారు చిన్నపిల్లలు ఊపిరి తీసుకునే వీలు లేక చాలా ఇబ్బంది పడవలసి వస్తుందని, అంతే కాకుండా భద్రాచలం రామాలయనికి ప్రతిరోజు భక్తులు దూర ప్రాంతల నుంచి వచ్చేవారికీ ఇక్కడి కాలుష్య వాతావరణం వల్ల ఇబ్బంది కలగటమే కాకుండా,పుణ్యక్షేత్ర విశిష్టత కూడా భంగం కలిగే అవకాశం ఉందిని,అసలు అధికారులకు అవగాహన లేకుండా ప్రజలు నివాసం ఉంటున్న మధ్య చెత్తను వేసి కాలుస్తున్న వారిపై  శాసనసభ్యులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసారు.

        భద్రాచలం పట్టణానికి ఈ డంపింగ్ యార్డ్ సమస్య లేకుండా  శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపట్టే విధంగా జిల్లా మంత్రి ని,జిల్లా కలెక్టర్ ని కలిసి త్వరగా ఏర్పాట్లు చేసే విధంగా చూస్తానని అప్పటివరకు ప్రజలకు ఇబ్బంది కలగకుండా చెత్తను వేరే చోట  వెయ్యాలని గ్రామపంచాయతీ అధికారులను ఆదేశించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments