ఎమ్మెల్యే పొదేం వీరయ్య ని అరెస్టు చేసినట్లు వస్తున్న వార్తలలో ఎటువంటి నిజం లేదు
..భద్రాచలం ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్..
జనవిజయం, 2 జులై( భద్రాచలం):భద్రాచలం పోలీసులు ఎమ్మెల్యే పొదేం వీరయ్య ని అరెస్టు చేసినట్లు వస్తున్న వార్తలలో ఎటువంటి నిజం లేదని భద్రాచలం ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఓ ప్రకటనలో తెలిపారు.ఎమ్మెల్యే స్వయంగా తన అనుచరులతో తమ స్వంత పని నిమిత్తం భద్రాచలం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు వచ్చి పోలీస్ అధికారులతో మాట్లాడుతుండగా తీసిన వీడియోను సోషల్ మీడియాలో పెట్టి ఎమ్మెల్యేను పోలీసులు అరెస్టు చేసినట్లుగా తప్పుడు వార్తను ప్రచారం చేస్తున్న వ్యక్తులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అంతేకాదు ఈ రోజు మీటింగ్ కొరకు ఖమ్మం వెళ్లే వారిని ఎవ్వరినీ కూడా నిర్బంధించడం గానీ,అదుపులోకి తీసుకోవడం గానీ జరగలేదని తెలిపారు.