భద్రాచలం, ఆగస్టు 11 (జనవిజయం): భద్రాచలం రెవెన్యూ డివిజనల్ అధికారిగా మాలోత్ మంగీలాల్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్లో ఎస్ డి సి గా విధులు నిర్వహిస్తున్న మంగీలాల్ ఆర్డీవో గా పదోన్నతి పొందారు. ఆర్డీవో గా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన భద్రాచలంలోని పోలింగ్ స్టేషన్ లు ను పరిశీలించారు . త్వరలో ఎన్నికలు వస్తున్నందున వికలాంగులకు, వృద్ధులకు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సిబ్బంది నీ ఆదేశించారు. ముఖ్యంగా వికలాంగుల కొరకు ప్రతి పోలింగ్ స్టేషన్లో ర్యాంపులు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి పోలింగ్ కేంద్రం లో విద్యుత్, మంచినీటి సౌకర్యం, మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎలక్షన్ డిటి రమేష్ మరియు సంబంధిత తాసిల్దారులు తదితరులు పాల్గొన్నారు.