- మండల పరిషత్ లో తీర్మానం చేపట్టాలని వినతి పత్రం
బోనకల్, జూలై 18(జనవిజయం) :
ఎన్నో ఏళ్ళుగా గిరిజనులు ,దళితులు, బీసీలు సాగు చేసుకుంటున్న బంజరాయి భూములకు పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వాలని కోరుతూ అందుకు అనుగుణంగా మండల పరిషత్ సమావేశంలో తీర్మానం చేసి,కలెక్టర్ కి ,రాష్ట్ర ప్రభుత్వానికి తీర్మానం ప్రతిని పంపించాలని ఎంపీపీ కంకణాల సౌభాగ్యం కు,ఎండిఓ వేణుమాధవ్ కు సంయుక్తంగా వినతి పత్రం అందజేయడం జరిగింది.అదేవిధంగా ట్రైకార్ లోన్లు మంజూరైన గిరిజన లబ్ధిదారులకు లోన్స్ ఇవ్వాలని కోరారు .ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గుగులోతు పంతులు మండల పరిషత్ ఉపాధ్యక్షులు గుగులోతు రమేష్ ,ఎంపీటీసీ కందిమల్ల రాధ ,కో ఆప్షన్ సభ్యుడు ఎస్కే జమాలుద్దీన్, జానీకిపురం గ్రామ సర్పంచ్ చిలకా వెంకటేశ్వర్లు ,గిరిజన సంఘం నాయకులు బాణోతునాగేశ్వరావు, భానోత్ మాన్య బానోతు రావుజా తదితరులు పాల్గొన్నారు.