జనవిజయంతెలంగాణబంగారు తెలంగాణ దిశగా గణనీయ ప్రగతిని సాధించాం - పువ్వాడ

బంగారు తెలంగాణ దిశగా గణనీయ ప్రగతిని సాధించాం – పువ్వాడ

ఖమ్మం,జూన్2(జనిజయం): తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణాగా మార్చుకునే క్రమంలో అనేక రంగాలలో గణనీయమైన ప్రగతిని సాధించుకున్నామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. రాష్ట్ర అవతరణ దినోత్స వేడుకలను పురస్కరించుకొని బుధవారం నగరంలోని పోలీసు పరేడ్ మైదానంలో జాతీయ పతాకావిష్కరణ అనంతరం మంత్రి పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ సాధించుకొని ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకున్నామని, గత ఏడేళ్ళల్లో రాష్ట్రంలో అనేక రంగాల అభివృద్ధి సాధించామని, విద్యుత్తు, సాగునీరు, త్రాగునీటి రంగాలలో విలక్షణ ప్రగతి సాధించామని మంత్రి తెలిపారు. 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరాతో విద్యుత్ రంగంలో ప్రగతి సాధించామని, గౌరవ ముఖ్యమంత్రివర్యులు తీసుకున్న నిర్ణయాలవల్ల వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయడం వల్ల యాసంగి, ఖరీఫ్ లో మన రాష్ట్రంలో 3 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి జరిగిందని మంత్రి తెలిపారు. 2020-21 యాసంగిలో 58 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్య సేకరణ చేయడం ద్వారా పంజాబ్ రాష్ట్రం తర్వాత తెలంగాణ ధాన్య సేకరణలో రెండవ స్థానంలో ఉందని ఈ సందర్భంగా మంత్రి చెప్పారు. సాగునీటి ప్రాజెక్టుల నవీకరణకు రూపకల్పన చేసి ఇప్పటికే కొన్ని ప్రాజెక్టులు పూర్తి చేసుకున్నామని మంత్రి అన్నారు. రైతులకు నిరంతరాయంగా ఉచిత కరెంటు అందిస్తూనే రైతుబంధు కింద ఏడున్నర వేల కోట్లను రైతుల ఖాతాలకు జమచేస్తున్న ఏకైక రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రమని మంత్రి తెలిపారు. ధరణీ పోర్టల్ ద్వారా దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న భూసమస్యలకు పరిష్కారం లభించిందని, పార్ట్-బి నుండి పార్-ఏకు వచ్చిన రైతులకు కూడా రైతుబందు అందిస్తామని అట్టి రైతులు జూన్-10లోగా ధరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. “కోవిడ్ సెకండ్ వేవ్”ను జిల్లాలో సమర్ధవంతంగా నియంత్రించగలిగామని, రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ వల్ల జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గిందని జూన్-9లోగా పాజిటివ్ రేటును 5 శాతానికి తగ్గించాలనే దిశగా ప్రభుత్వం లాక్ డౌన్ కఠినంగా అమలు చేస్తుందన్నారు. ఖమ్మం జిల్లాకు ఇతర రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాలు ఉన్నందున వ్యాప్తిని అరికట్టేందుకు పరిసర ప్రాంతాలలో ప్రత్యేక చెక్ పోస్టులను ఏర్పాటు చేసి నిఘాను మరింత కట్టుదిట్టం చేసామని కోవిడ్ కేసులను తగ్గించడంలో జిల్లాలో ఫ్రంట్ లైన్ వారియర్స్ సేవలు ప్రశంసనీయమన్నారు. జిల్లాలో ఇంటింటి జ్వర సర్వే వల్ల పాజిటివ్ రేటును తగ్గించుకోగలిగామని రోగలక్షణాలు కలిగిన వారికి మెడికల్ కిట్ ను అందించడంతో పాటు టెస్టుల సంఖ్యలను మరింత పెంచామని మంత్రి అన్నారు. జిల్లాలో ఆక్సిజన్, ఇంజెక్షన్ల సమస్య లేకుండా ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రులలో సరిపడా నిల్వలను అందుబాటులో ఉంచామన్నారు. ఆక్సిజన్ అవసరమైన కోవిడ్ పేషెంట్ల కొరకు ఇంటివద్దనే ఆక్సిజన్ సదుపాయం కల్పించేందుకు గాను ఇండియన్ ఫ్రంట్స్ ఆఫ్ అట్లాంట, మమత ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2 కోట్ల విలువైన 250 ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్ను ఉమ్మడి జిల్లాకు అందించినట్లు మంత్రి తెలిపారు. రాబోయో రోజుల్లో ఎటువంటి కఠిన పరిస్థితులైననూ ఇదే స్ఫూర్తితో సమర్ధవంతంగా అధిగమిస్తామన్నారు. ఖమ్మం జిల్లా ప్రజాప్రతినిధులు విపత్కర పరిస్థితులలో ప్రజలకు నిత్యం అందుబాటులో అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్నారని మంత్రి తెలిపారు. ఖమ్మం జిల్లాను రోల్ మోడల్ గా ఉంచడంలో భాగంగా ఇప్పటికే నగరంలో అద్దిన సొగబులే ఉదాహరణగా నిలిచాయన్నారు. జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్, పోలీసు కమీషనర్ విష్ణు.యస్.వారియర్, శాసనమండలి సభ్యులు బాలసాని లక్ష్మీనారాయణ, సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య, వైరా శాసనసభ్యులు లావుడ్యా రాములు నాయక్, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజు, మార్క్ ఫెడ్ రాష్ట్ర వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, నగర మేయర్ పి.నీరజ, సుడాచైర్మన్ బచ్చు విజయ్ కుమార్, డిప్యూటీ మేయర్ ఫాతీమా జోహరా, డి.సి.సి. బి, డి.సి.ఎం.ఎస్ చైర్మన్లు కూరాకుల నాగభూషణం, రాయల శేషగిరిరావు, గంధ్రాలయ సంస్థ చైర్మన్ ఖమర్, ఇతర ప్రజా ప్రతినిధులు తదితరుల పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్నారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి