జనవిజయంతెలంగాణబండి సంజయ్ రాజకీయాలు మానాలి - పల్లా రాజేశ్వరరెడ్డి

బండి సంజయ్ రాజకీయాలు మానాలి – పల్లా రాజేశ్వరరెడ్డి

  • ధాన్యం కొనుగోళ్లపై అనవసర రాజకీయాలు
  • కరానా సంక్షోభంలోనూ సజావుగా ధాన్యం కొనుగోళ్లు
  • తెలంగాణలో భారీగా వరి దిగుబడి అయ్యిందని తెలుసుకోవాలి
  • బిజెపికి కౌంటర్ ఇచ్చిన ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి

హైదరాబాద్, మే24(జనవిజయం): టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వం అని రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో, ధాన్యం కొనుగోళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందన్న బీజేపీ నేతల వ్యాఖ్యలను పల్లా తీవ్రంగా ఖండించారు. వ్యవసాయంపై అవగాహన లేని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ జోకర్ మాట్లాడుతున్నారని పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎద్దేవా చేశారు. సోమవారం ఆయన టీఆర్ఎస్ నేతలతో కలసి తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ.. 24గంటల ఉచిత కరెంట్ దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వడం లేదన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రంలో ఎక్కడైనా ఇస్తున్నారా? చూపిస్తారా అని బండి నంజయకు నవాల్ విసిరారు. వరి పంటలో దేశంలో తెలంగాణ నంబర్ వన్ గా ఉందన్నారు. దమ్ముంటే.. రాష్ట్రంలో ఒక్క ప్రాజెక్టుకైనా జాతీయ హోదా ఇప్పించాలని పల్లా రాజేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఏ రాష్ట్రంలో కొనుగోలు చేయని విధంగా, లా డౌన్ ఉన్నప్పటికీ ధాన్యం కొనుగోళ్ల షక్రియ కొనసాగుతుందన్నారు. యాసంగిలో 52 లక్షల ఎకరాల్లో వరిసాగు చేసి దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచామన్నారు. సకాలంలో ప్రాజెక్టులు పూర్తి చేశామని తెలిపారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ధాన్యాన్ని సేకరిస్తున్నామని స్పష్టం చేశారు. నలుగురు ఎంపీలు ఉ న్నామని చెప్పుకుంటున్న బీజేపీ నేతలు.. దమ్ముంటే కాళేశ్వరం, నీతారామ, పాలమూరు ప్రాజెక్టుల్లో ఏదైనా ఒకదానికి జాతీయ హోదా తీసుకుని రావాలని డిమాండ్ చేశారు. రైతుబంధు పథకం కింద 60 లక్షల మంది రైతులకు రూ. 15 వేల కోట్లు ప్రభుత్వం అందిస్తోందని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో వేలాది రైతు వేదికలు నిర్మించామన్నారు. రూ. 750 కోట్ల వ్యయంతో లక్ష రైతు కల్లాలను ఏర్పాటు చేశామని తెలిపారు. రైతుబీమా పథకం ద్వారా రైతు చనిపోయిన 10 రోజుల్లోపే రూ. 5 లక్షలు చెల్లిస్తున్నాం. ఈ పథకం ద్వారా 50,600 మంది రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం చేశామన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతు సంక్షేమ పథకాలు అమలవుతున్నాయా? అని పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. 60 లక్షల మంది రైతులకు రైతుబంధు ఇస్తున్నామని స్పష్టం చేశారు. రైతుబంధుతో రైతులకు మేలు జరుగుతుంటే బీజేపీ నేతలు తట్టుకోలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంటలను తెలంగాణలో తప్పా దేశంలో ఎక్కడ కొనుగోలు చేయడం లేదన్నారు. రాష్ట్రంలో పండించిన పంట మొత్తం కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. నలుగురు బీజేపీ ఎంపీలు రాష్ట్రంలో ఉండి ఒక్క మెడికల్ కాలేజ్ కూడా తీసుకురాలేకపోయరని చెప్పారు. సీఎం కరోనా బాధితులకు అండగా ఉంటున్నారని, ప్రతిపక్షాలు అనవసరపు విమర్శలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. కరోనా బాధితులకు ఆక్సిజన్, మందులు, బెడ్ల కొరత లేకుండా చేస్తున్నామని పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి