జనవిజయంసినిమాబాలయ్యతో శ్రుతి కలుపుతుందా?

బాలయ్యతో శ్రుతి కలుపుతుందా?

బాలయ్య ప్రక్కన హీరోయిన్ గా శ్రుతిహాసన్‌ ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. క్రాక్‌తో ఈ ఏడాది హిట్‌ కొట్టాడు దర్శకడు మలినేని గోపీచంద్‌. రవితేజ నటించిన ఈ సినిమా కరోనా ఫస్ట్‌ వేవ్‌ తర్వాత టాలీవుడ్‌ కి మంచి ఊపును ఇచ్చింది. అందులో హీరోయిన్‌ శ్రుతిహాసన్‌. తన తాజా చిత్రం లోనూ శ్రుతిహాసన్‌ నే రిపీట్‌ చేయబోతున్నాడట మలినేని గోపీచంద్‌. ’క్రాక్‌’ హిట్‌ తో ఏకంగా బాలకృష్ణతో సినిమా చేసే ఛాన్స్‌ పట్టేశాడు గోపి. మైత్రీమూవీస్‌ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. సినిమాను లాంఛనంగా అరంభించారు కూడా. ’డాన్‌ శీను, బలుపు, పండగ చేస్కో’ వంటి సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న గోపీచంద్‌ బాలకృష్ణ ఇమేజ్‌ కి సరిపోయేలా ఓ చరిత్రకారుని కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించబోతున్నాడట. పల్నాటి ప్రాంతానికి చెందిన ఆ చరిత్రకారుని కథకి బాలయ్య నూటికి నూరు పాళ్లు యాప్ట్‌ అంటున్నారు. జులై నుంచి ఈ సినిమా సెట్స్‌ విూదకు వెళ్ళనుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలన్నది దర్శకనిర్మాతల ప్లాన్. ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటితో ’అఖండ’ సినిమా చేస్తున్నారు. జూలైకి ఈ సినిమా పూర్తి కానుంది. ఆ వెంటనే గోపీచంద్‌ సినిమా షూటింగ్‌ లో జాయిన్‌ అవుతారట బాలకృష్ణ. బాలయ్య, శ్రుతిహాసన్‌ ఫస్ట్‌ కాంబినేషన్‌ ప్రేక్షకులను ఎలా అరిస్తుందో మరి!

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి