జనవిజయంసినిమాబాలయ్య 107వ సినిమాలో జయమ్మ ఫిక్స్

బాలయ్య 107వ సినిమాలో జయమ్మ ఫిక్స్

రేయ్ ఖాకీ….. అంటూ క్రాక్ లో దుమ్ము రేపిన జయమ్మ ఇపుడు మరో పవర్ ఫుల్ పాత్రను పోషించబోతోంది. మాస్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న నటుడు నందమూరి బాలకృష్ణ. పవర్ ఫుల్ డైలాగులతో మాస్ ని ఆకట్టుకునే బాలయ్య సినిమాలో మిగతా నటులు కూడా పవర్ ఫుల్ క్యారెక్టర్లు పండితే ఆ సినమా రూటే వేరని చెప్పొచ్చు. వరలక్ష్మీ శరత్‌కుమార్‌ ఈ సినిమాలో ఒక పవర్ ఫుల్ రోల్ చేయబోతున్నారనే వార్త బయటకు వచ్చింది. బాలయ్య బర్త్ డే రోజు సింహం వేట మొదలయ్యింది అంటూ…. NBK107 మోషన్ పోస్టర్ రిలీజ్ చేయడం ద్వారా అఖండ తరువాత బాలయ్య సినిమా ప్రారంభం అవుతుందని ప్రకటించారు నిర్మాతలు. ఆ న్యూస్ తోనే బాలయ్య అభిమానుల హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తుండగా ఇపుడు వెంటనే ఈ సినిమాలో జయమ్మ (వరలక్ష్మీ శరత్ కుమార్) ముఖ్యమైన పాత్ర చేస్తుందనే వార్త మరింత హుషారును కలిగిస్తోంది.

ఈ విషయమై చిత్ర యూనిట్ కన్ఫర్మ్ చేయగా ఆ పాత్రధారి వరలక్ష్మీ శరత్ కుమార్ మాట్లాడుతూ కెంతో ఇష్టమైన డైరెక్టర్‌ గోపిచంద్‌ మలినేని దర్శకత్వంలో మరోసారి పనిచేయడం ఆనందంగా ఉంది. ఎప్పుడెప్పుడు ఈ చిత్ర షూటింగ్‌లో పాల్గొంటానా అని ఆశగా ఎదురుచూస్తున్నానని తెలిపారు. మలినేని గోపిచంద్ బాలయ్య 107 వ సినిమాని కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నారట. ఈ సినిమాలో కూడా వరలక్ష్మి పాత్ర వవర్ ఫుల్ గానే ఉంటుందని భావిస్తున్నారు. జయమ్మ బాలయ్య కు యాంటీగా వస్తుందా, బాలయ్య బ్యాచ్లో ఉంటుందా అనేది తెలియాల్సి ఉంది. మొత్తం మీద బాలయ్య సినిమాలో జయమ్మ ఫిక్స్ అయిందనగానే టాలీవుడ్ లో ఈ సినిమాపై క్రేజ్ పెరిగింది. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తోంది. క్రాక్ సినిమాలో జయమ్మ పాత్రకు వచ్చిన రెస్పాన్స్ ని ఆధారం చేసుకున్న మలినేని ఈ సినిమాలో కూడా జయమ్మ రేంజ్ కు తగ్గకుండా ఆమె పాత్రను మలుస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. మాస్ ఆడియన్స్ టార్గెట్‌గా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారని, ఇందులో బాలయ్య బాబు పవర్‌ఫుల్ మాస్ గెటప్‌లో కనిపించనున్నారని టాక్.  బాలయ్య, జయమ్మ లు ప్రత్యర్ధులుగా ఉంటే మాత్రం ఈ సినిమాకు అదో ఎసెట్ అని చెప్పక తప్పదు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆంధ్రప్రదేశ్ఆరోగ్యంప్రత్యేకంసినిమావాణిజ్యంసాహిత్యంస్పూర్తిఅంతర్జాతీయంవ్యవసాయంప్రముఖులుఆయుర్వేదంపోల్స్అధ్యయనంవిద్యవీడియోలుమంతెన ఆరోగ్య సలహాలుజర్నలిజంవినదగునెవ్వరు చెప్పినఎడిటర్ వాయిస్వికాసంపర్యావరణంపిల్లల పెంపకంవార్త-వ్యాఖ్యనేర వార్తలుఎన్నికలుతెలుసుకుందాంవిజ్ఞానంవీరమాచనేని డైట్ సలహాలుఆధ్యాత్మికంజీవనంన్యాయంసమాజంఆర్ధికంఉపాధిప్రకృతివాతావరణంవార్తలురాజ్యాంగంకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీవినోదంసాంకేతికతఎడిట్ప్రజఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి