జనవిజయంతెలంగాణరెండోసారి ఫోన్ చేసి అభినందించిన బాలయ్య! అభిమాని ఖుషీ!!

రెండోసారి ఫోన్ చేసి అభినందించిన బాలయ్య! అభిమాని ఖుషీ!!

ఖమ్మం, మే23 (జనవిజయం) : ఖమ్మం కు చెందిన నల్లమల రంజిత్ కు యువరత్న నందమూరి బాలకృష్ణ ఫోన్ చేసి అభినందించడం పట్ల అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లా నందమూరి యువసేన నాయకులు, తెలుగు దేశం పార్టీ అనుబంధ యువజన సంఘం తెలుగు యువత అధ్యక్షులు కూడా అయిన నల్లమల రంజిత్ నందమూరి ఫ్యామిలీ పట్ల వీరాభిమానిగా పలు సేవాకార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. పేద కుటుంబాలకు ఆర్ధికంగా కూడా సహకారం చేస్తుంటారు. ఇటీవల కరోనా భాధితులకు కూడా పలు రకాలుగా రంజిత్ అండగా నిలవడం నందమూరి బాలకృష్ణకు తెలిసి ఆయన పోన్ చేశారు. గతంలో కూడా బాలయ్య రంజిత్ కు ఫోన్ చేసి మాట్లాడారు. తమ అభిమాన కథానాయకుడు రెండోసారి కాల్ చేసి మాట్లాడడం, యోగా క్షేమాలు కనుక్కోవడం పట్ల రంజిత్ హర్షం వ్యక్తం చేశారు. కరోనా తగ్గాక ఖమ్మం జిల్లాకు వచ్చి గతంలో బాలకృష్ణ చేత ప్రారంభించకుండా ఆగిపోయన సీనియర్ ఎన్.టి.ఆర్ విగ్రహాలను ప్రారంభిస్తానని బాలయ్య చెప్పారని రంజిత్ తెలిపారు. గతంలో ఖమ్మం జిల్లాలో బాలకృష్ణ పర్యటన సందర్భంగా పాతర్లపాడు గ్రామంలో సీనియర్ ఎన్.టి.ఆర్ విగ్రహాలను సమయం సరిపోనందున ఆవిష్కరించలేకపోయారు. అప్పటినుండి తిరిగి బాలయ్య చేతనే ఆ విగ్రహాలను ఆవిష్కరింపచేయాలని రంజిత్ పట్టుదలతో ఉన్నారు. ఈసారైనా రంజిత్ కోరికను బాలయ్య మన్నిస్తాడేమో చూడాలి మరి.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆంధ్రప్రదేశ్ఆరోగ్యంప్రత్యేకంసినిమావాణిజ్యంసాహిత్యంస్పూర్తిఅంతర్జాతీయంవ్యవసాయంప్రముఖులుఆయుర్వేదంపోల్స్విద్యఅధ్యయనంమంతెన ఆరోగ్య సలహాలువీడియోలుజర్నలిజంవికాసంవినదగునెవ్వరు చెప్పినపర్యావరణంఎడిటర్ వాయిస్ఎన్నికలుతెలుసుకుందాంపిల్లల పెంపకంవిజ్ఞానంవార్త-వ్యాఖ్యనేర వార్తలువీరమాచనేని డైట్ సలహాలుఆధ్యాత్మికంజీవనంన్యాయంఆర్ధికంఉపాధిప్రకృతివాతావరణంవార్తలురాజ్యాంగంసమాజంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీవినోదంసాంకేతికతఎడిట్కుటుంబంప్రజఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి