భద్రాచలం నియోజకవర్గ అభివృద్ధికి 14 కోట్ల 50 లక్షల మంజూరు
ఫలించిన బాలసాని కృషి
భద్రాచలం, 12 ఆగస్ట్(జనవిజయం): మాజీ MLC,భద్రాచలం నియోజకవర్గ ఇంచార్జీ బాలసాని లక్ష్మీ నారాయణ గ ఇటీవల ముఖ్యమంత్రి గారిని కలిసి భద్రాచలం నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కొరకు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. స్పందించిన ముఖ్యమంత్రి KCR వెంటనే సమగ్ర నివేదిక పంపవలసిందిగా కోరారు.
నివేదిక అందిన వెంటనే నేడు 14కోట్ల 50 లక్షల రూపాయలకు పరిపాలన పరమైన అనుమతులు ఇచ్చారు.
బాలసాని లక్ష్మి నారాయణ అభ్యర్ధన మేరకు ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు తన్నీరు హరీష్ రావు కృషి మేరకు నిధులు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి KCR గారికి పార్టీ శ్రేణులు ధన్యవాదాలు తెలిపారు.