BRS శ్రేణులు వరద ప్రభావిత ప్రాంతాలలో సహయక చర్యలలో పాల్గొనాలి
- మాజీ MLC, భద్రాచలం నియోజకవర్గ ఇంఛార్జి బాలసాని పిలుపు
భద్రాచలం, 20 జూలై(జనవిజయం):
భద్రాచల నియోజకవర్గ BRS పార్టీ శ్రేణులు అందరూ వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించి సహయక చర్యలలో పాల్గొనాలని బాలసాని లక్ష్మీనారాయణ, మాజీ MLC మరియు భద్రాచలం నియోజకవర్గ ఇంఛార్జి ఓ ప్రకటన లో తెలిపారు. కురుస్తున్న భారీ వర్షాలు, వరదలు కారణంగా రైతువేదికల వద్ద నిర్వహించ తలపెట్టిన రైతు సమవేశలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు ఐటీ శాఖ మత్యులు కేటీఆర్ వారం పాటు వాయిదా వేసిన కారణంగా భద్రాచలం నియోజకవర్గంలో గోదావరి వరద ఉదృతంగా వస్తున్న ప్రాంతాలలో స్థానిక పార్టీ నాయకులు కార్యకర్తలు స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఎటువంటి ప్రాణ మరియు ఆస్తి నష్టం కలుగకుండా సహాయక చర్యలలో తప్పకుండా పాల్గొనాలని తెలిపారు.