జనవిజయంసాహిత్యంబాలలకో బహుమతి పుస్తకావిష్కరణ

బాలలకో బహుమతి పుస్తకావిష్కరణ

ఖమ్మం కల్చరల్, జూలై 11(జనవిజయం): ప్రముఖ రచయిత్రి, తెలుగు ఉపాధ్యాయురాలు వురిమళ్ల సునంద కలం నుండి జాలువారిన ‘బాలలకో బహుమతి’ పుస్తకాన్ని ఎస్.సి.ఇ.ఆర్.టి కో ఆర్డినేటర్ సువర్ణ వినాయక్ ఆవిష్కరించారు. అక్షరాల తోవ, వురిమళ్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం రాత్రి జూమ్ లో ఈ కార్యక్రమం జరిగింది. ఆవిష్కరణ అనంతరం సువర్ణ వినాయక్ మాట్లాడుతూ బాల సాహిత్యంలో విశేష కృషి గావిస్తున్న వురిమళ్ల సునందను అభినందించారు. బాల సాహిత్యంలో పిల్లల ప్రపంచం వెల్లివిరియాలని, పిల్లలు ఆలోచించే రీతిలో వారి భావాలను, వారి మాటలను, వారి ప్రపంచాన్ని పట్టుకోగలగాలని సూచించారు. అలా పిల్లల ఊహలకు అక్షర రూపాన్నిచ్చిన వురిమళ్ల సునందను అభినందించారు. అనంతరం బాలలకో బహుమతి పుస్తకాన్ని ప్రముఖ కవి, వాగ్గేయకారులు కన్నెగంటి వెంకటయ్య సమీక్షించారు. పుస్తకంలోని కథల్ని, వాటి వెనుక వున్న అంతరాన్ని, రచయిత సునంద ఆలోచనను చక్కగా వివరించి అందరికీ ఆకట్టుకున్నారు. ఈ సందర్భగా వురిమళ్ల ఫౌండేషన్, అక్షరాలతోవ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కవితల, కథల పోటీల ఫలితాలను వురిమళ్ల ఫౌండేషన్ వ్యవస్థాపకులు వురిమళ్ల సునంద, భోగోజు ఉపేందర్రావు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కవులు మువ్వా శ్రీనివాసరావు, ఆనందాచారి, రౌతు రవి, మేడగాని శేషగిరి, పాఠ్య పుస్తక రచయిత డాక్టర్ గట్టు త్రివేణి, అక్షరాల తోవ నిర్వాహకులు నామా పురుషోత్తం, దాసరోజు శ్రీనివాస్, రాచమళ్ల ఉపేందర్, ఖమ్మానికి చెందిన కవులు, సాహిత్యాభిమానులు తదితరులు పాల్గొన్నారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి