జనవిజయంతెలంగాణబాధ్యతలు స్వీకరించిన వి.సి రాథోడ్

బాధ్యతలు స్వీకరించిన వి.సి రాథోడ్

స్వంత జిల్లాలో వి.సి కావడం ఆనందంగా ఉందని వెల్లడి

మహబూబ్ నగర్,మే24(జనవిజయం): పాలమూరు విశ్వవిద్యాలయం నూతన వైస్ చాన్సలర్ గా ప్రొఫెసర్ ఎల్.బి. లక్ష్మీకాంత్ రాథోడ్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఉస్మానియా యూనివర్సిటీ డీన్, నిజాం కాలేజీ ప్రిన్సిపాల్ గా పనిచేసిన రాథోడ్ నారాయణపేట జిల్లా మద్దూరు మండలం తిమ్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన వారు. మహబూబ్ నగర్ లోనే డిగ్రీ వరకు విద్యాభ్యాసం పూర్తి చేసిన రాథోడ్ సొంత జిల్లాలోనే వీసీగా పనిచేయడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. క్రీడాకారుడైన తాను అటు విద్యతో పాటు క్రీడా రంగానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు వెల్లడించారు. విద్యార్థులు త్వరగా జీవితంలో స్థిరపడేలా విద్యాబోధన ఉండేందుకు గాను కొత్త కోర్సులు ప్రవేశపెట్టాల్సి ఉందని రాథోడ్ తెలిపారు. యూనివర్సిటీలో ప్లేన్ మంట్ సెల్ ఏర్పాటు చేసి క్యాంపస్ నియామకాలు చేపట్టేందుకు ప్రయత్నిస్తామని వెల్లడించారు. యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న పోస్టులు వెంటనే భర్తీ చేసి మెరుగైన విద్యాబోధన జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. తెలంగాణలో తొలిసారిగా ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రొఫెసర్ కు వీసీగా అవకాశం లభించిందని ఆయన తెలిపారు. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలిపారు. వీసీగా బాధ్యతలు స్వీకరించిన రాథోడ్ కు రిజిస్టార్ ప్రొఫెసర్ పిండి పవన్ కుమార్, ఓఎన్జీ మధుసూదన్ రెడ్డి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ కుమార స్వామి, ప్రత్యేక అధికారి ప్రొఫెసర్ బీఎన్ రావు, నాన్స్ అధికారి దయానిధి, అసిస్టెంట్ ప్రొఫెసర్ వెంకటేశ్వర్ రావు, అకౌంట్స్ ఆఫీసర్ బాలకృష్ణ, సూపరింటెండెంట్ రవీందర్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి