గోదావరి వరద బాధితులను పరామర్శించిన బిజెపి
భద్రాచలం, జూలై 29 (జనవిజయం):
భద్రాచలం పట్టణంలోని గోదావరి వరద పునరావాస కేంద్రమైన జూనియర్ కాలేజీలో ఉన్న వరద బాధితులను భారతీయ జనతా పార్టీ నాయకులు పరామర్శించారు. వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం సమయానుకూలంగా భోజన సదుపాయం చేయటం లేదని, చిన్నపిల్లలు దోమలకు బాధపడుతున్నారని వారు వివరించారు.
వెంటనే వారి సమస్యలను సంబంధిత ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం చూపవలసిందిగా కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్రం రాజు బెహరా, జిల్లా కార్యదర్శి నిడదవోలు నాగబాబు, మండల అధ్యక్షులు ములిశెట్టి రామ్మోహన్ రావు, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ బోడ సత్యనారాయణ, భారతీయ జనతా పార్టీ యువ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు ములిసేట్టి నిఖిల్, మండల ప్రధాన కార్యదర్శి చెలుబోయిన వెంకన్న, త్రిబుల్ ఎక్స్ చక్రవర్తి, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు దేవరపల్లి వెంకటేశ్వర్లు, మండల ఉపాధ్యక్షులు సూరత్ సుదర్శన్, గడ్డం శ్రీహరి, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు జయరాజు, గిరిజన మోర్చా మండల అధ్యక్షులు పేరం ఉపేందర్మండల ఉపాధ్యక్షులు కొణిజర్ల ముక్తేశ్వరరావు, సీనియర్ నాయకులు ఆవుల సుబ్బారావు, మండల ఉపాధ్యక్షులు అల్లాడి వెంకటసుబ్బయ్య, ముత్యాల శ్రీనివాస్, ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి p.c కేశవ తదితరులు పాల్గొన్నారు.