కొత్తగూడెం, ఆగస్ట్ 29 (జనవిజయం): లయన్స్ క్లబ్ ఆధ్వర్యం లో లయన్స్ గవర్నర్ శివప్రసాద్ వరద బాధితులకు మంగళవారం నిత్యావసర సామగ్రి నీ పంపిణీ చేసేరు. జిల్లాలోని పినపాక, భద్రాచలం నియోజకవర్గాల్లో గోదావరి వరద కారణంగా నష్టపోయిన బాధితులకు ఆయా గ్రామాల్లో 350 మందికి నిత్యవసర సరుకులు, దుప్పటి, భోజనం ప్లేట్స్ వ కిట్లను వరద బాధితులకు అందజేశారు. లయన్స్ క్లబ్ డిస్టిక్ గవర్నర్ 320 ఈ (ఎల్ సి ఐ ఎఫ్) ఫండ్ తో ఒక కిట్టు రూ రెండు వేలు విలువచేసే నిత్యవసరాలు అందజేసినట్లు తెలిపారు. ఆళ్లపల్లి మండలం రాయపాడులో 40, మణుగూరులో 60, అశ్వాపురంలో 45, భద్రాచలంలో 52, దుమ్ముగూడెం లో 120 కిట్లు పంపిణీ చేసేరు.
లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ 320 ఈ సిహెచ్ వి శివప్రసాద్, మాజీ గవర్నర్ దారాకృష్ణారావు, లయన్స్ క్లబ్ భద్రాచలం అధ్యక్షులు భీమవరపు వెంకటరెడ్డి, యోగి సూర్యనారాయణ, పల్లింటి దేశప్ప, పరిమి సోమశేఖర్, బి రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.