జనవిజయంసినిమానిర్మాత, జర్నలిస్ట్‌ బిఎ రాజు హఠాన్మరణం

నిర్మాత, జర్నలిస్ట్‌ బిఎ రాజు హఠాన్మరణం

  • దిగ్భ్రాంతికి గురైన చిత్ర పరిశ్రమ
  • నివాళి అర్పించిన పలువురు సినీ ప్రముఖులు

సీనియర్‌ సినీ జర్నలిస్ట్‌, నిర్మాత, పీఆర్వో బీఏ రాజు హఠాన్మరణం చెందారు. గుండెపోటుతో ఆయన మరనించారని సమాచారం. ఈ వార్తతో చిరంజీవి, బాలకృష్ణ. మహేశ్‌, ప్రభాస్‌, ఎన్టీఆర్‌ తదితరులతోపాటు పలు నిర్మాణ సంస్థల నిర్మాతలు, దర్శకులు, సాంకేతిక నిపుణులు తీవ్ర దిగ్బార్రతికి లోనయ్యారు. బీఏ రాజుతో తమకున్న సాన్నిహిత్యాన్ని సోషల్‌ విూడియా వేదికగా గుర్తుచేసుకున్నారు. తాను మద్రాస్‌లో ఉన్నప్పటి నుంచి బీఏ రాజుతో పరిచయం ఉందని చిరంజీవి తెలిపారు. సినీ పరిశ్రమకు సంబంధించిన ఎన్నో విషయాలను పూసగుచ్చినట్లు చెప్పేవారని చిరంజీవి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. బీఏ రాజు ఈ పేరు తెలియని వ్యక్తి సినిమా పరిశ్రమలో ఉండరు. సినిమాకు సంబంధించిన విశేషాలను ఆయన నుంచి తెలుసుకునేవాడిని. లొకేషన్స్‌కి వచ్చి నాతో సరదాగా ముచ్చటించేవారు. నేను నటించిన ఎన్నో సినిమాలకు ఆయన పీఆర్‌వోగా వ్యవహరించారు. సినిమాలకు సమస్త సమాచారం కొన్నేళ్ల క్రితం విడుదలైన క్లాసిక్స్‌, కలెక్షన్స్‌, ట్రేడ్‌ రిపోర్ట్‌ రికార్డుల గురించి చెప్పగల గొప్ప నాలెడ్జ్‌ బ్యాంక్‌ ఆయన. ఏ సినిమా ఏ తేదీన విడుదలైంది, ఎంత వసూలు చేసింది? ఏ సెంటర్‌లో ఎన్నిరోజులు ఆడిరది, 100, 175, 200 రోజులు అంటూ ప్రతిదీ పరిశ్రమకు ఎన్‌సైక్లోపీడియాలా సమాచారం అందించేంత గొప్ప జర్నలిస్ట్‌. సూపర్‌హిట్‌ సినీ మ్యాగజైన్‌ కర్త, అనేక సినిమా సక్సెస్‌లలో కీలక పాత్ర పోషించిన బీఏ రాజు లాంటి వ్యక్తి ఉండడం పరిశ్రమ అదృష్టం. అలాంటి వ్యక్తి నేడు లేరన్న వార్త విని షాక్‌కి గురయ్యాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని.. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానని చిరు పేర్కొన్నారు. రాజుతో తనకు ఎప్పటినుంచో మంచి అనుబంధం ఉందని,ఈరోజు ఆయన మన మధ్య లేరనే వార్త నన్నెంతో కలిచివేసిందని నటుడు బాలకృష్ణ అన్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. నా మొదటి సినిమా నుంచి ఆయనతో అనుబంధం ఉంది. నాకు మాటలు రావడం లేదు. ఆయన లేరనే విషాద వార్తను జీర్ణించుకోలేకపోతున్నానని విక్టరీ వెంకటేశ్‌ సంతాపం తెలిపారు. మంచి స్నేహితుణ్ణి కోల్పోయా! నా తమిళ, తెలుగు సినిమాలకు వారధిలా నిలిచారు. విూ జ్ఞాపకాలు ఎప్పటికీ పదిలంగా ఉంటాయని చియాన్‌ విక్రమ్‌ అన్నారు. నా విూద విపరీతమైన ప్రేమ చూపించే రాజుగారు వృత్తి పరమైనా అనుబంధాన్ని వ్యక్తిగత బంధంగా మార్చేశారు. ఆయన లేరనే వార్త చాలా బాధ కలిగించింది. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని నటుడు సూర్య అన్నారు. తాను హైదరాబాద్‌లో మొదట అడుగుపెట్టిన రోజు నుంచి ఇటీవల విడుదలైన సుల్తాన్‌ సినిమా వరకూ నాతో ఉన్నారు. నాకు బిగ్గెస్ట్‌ సపోర్ట్‌ ఆయన. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తు ఉండేవారు. ఇకపై మనతో ఉండరన్న మాటను తట్టుకోలేకపోతున్నాని కార్తీ అన్నారు. బీఏరాజు మరణ వార్త విని నిజంగా షాక్‌ అయ్యాను. సినీ పాత్రికేయుడిగా, 1500 చిత్లరాకు పీఆర్వోగా పనిచేసిన మంచి వ్యక్తిని కోల్పోవడం బాధగా ఉంది. ఆయన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. ఇకపై ఆయన్ని ఎంతో మిస్‌ అవుతామని దర్శకుడు రాజమౌళి అన్నారు. బీఏరాజు గారి మరణంతో దిగ్భార్రతికి లోనయ్యా. సినీ జర్నలిస్ట్‌, పీఆర్వోగా సినీ పరిశ్రమకు ఆయన ఎన్నో సేవలందించారు. తెలుగు చిత్రపరిశ్రమలో నా ప్రయాణం మొదలైనప్పటి నుంచి నాకు ఆయనతో పరిచయం ఉంది. ఆయన మరణం సినీ పరిశ్రమకు తీర్చలేని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు నటుడు ఎన్టీఆర్‌ అన్నారు. బీఏ రాజు గారి అకాల మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. నా చిన్నతనం నుంచి ఆయన నాకు తొసు. ఎన్నో సంవత్సరాుగా ఆయనతో కలిసి ప్రయాణిస్తున్నాను. ఆయన నాకెంతో ఆప్తుడు. మా కుటుంబమంటే ఎనలేని గౌరవం ఆయనకు. మేమే ఆయనకు ప్రపంచం. ఆయన మరణం సినీ పరిశ్రమకే కాదు ముఖ్యంగా మా కుటుంబానికి పెద్ద లోటని నటుడు మహేశ్‌ బాబు అన్నారు. కెరీర్‌ బిగినింగ్‌ నుంచి ప్రతి అడుగులోనూ బీఏరాజు ఉన్నారు. నా కుటుంబ సభ్యుడిని కోల్పోయాను. ఆయనతో ఎన్నో మధుర జ్ఞాపకాున్నాయని నటుడు ప్రభాస్‌ అన్నారు. బీఏ రాజు… నువ్వు లేని తెలుగు సినీ విూడియా, పబ్లిసిటీ… ఎప్పటికీ లోటే. తరతరాలుగా నువ్వు తెలుగు సినిమా ఇండస్ట్రీకి అందించిన సేవలు కలకాలం గుర్తుండిపోతాయి. నీ ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని రాఘేవంద్ర రావు అన్నారు. ఇలా సుమలత, తమన్‌,శ్రీనువైట్ల, కొరటాల శివ, ప్రకాశ్‌రాజ్‌, విశాల్‌ ,కల్యాణ్‌రామ్‌, అనిల్‌ రావిపూడి, సతీశ్‌ వేగేశ్న, నటుడు నాని, గీతా ఆర్ట్స్‌, సితారా ఎంటర్‌టైన్‌ మెంట్స్‌, జీఏ2 పిక్చర్స్‌, ఎఆర్‌టీ ఫిల్మ్స్‌, మెగా సూర్య మూవీస్‌ సంస్థలు నిర్మాతలు బీఏ రాజు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి