Saturday, February 24, 2024
Homeరాజకీయంఅయోధ్య రాముడి సేవలో బిగ్‌ బి

అయోధ్య రాముడి సేవలో బిగ్‌ బి

(సినిమా డెస్క్,జనవిజయం)

బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌  అయోధ్యలోని రామ మందిరాన్ని మరోసారి సందర్శించారు. శుక్రవారం ముంబై నుంచి అయోధ్యకు వెళ్లిన బిగ్‌బీ బాలరాముడిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. భారీ భద్రత మధ్య బిగ్‌బీ ఆలయం నుంచి బయటకు వస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది. కాగా, అమితాబ్‌ బచ్చన్‌ నెల రోజుల వ్యవధిలోనే అయోధ్య రామ మందిరాన్ని సందర్శించడం ఇది రెండో సారి. గత నెల 22వ తేదీన బాలరాముడి ప్రాణ ప్రతిష్టకు హాజరైన విషయం తెలిసిందే. ప్రధాని మోదీ చేతులవిూదుగా అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకలకు బిగ్‌బీతోపాటు సినీ, రాజకీయ సహా పలు రంగాలకు చెందిన పారిశ్రామిక వేత్తలు హాజరై శ్రీరాముడిని దర్శించుకున్నారు. అప్పుడు రాముడి దర్శనానికి సంబంధించిన ఫొటోలను కూడా బిగ్‌బీ సోషల్‌ విూడియాలో షేర్‌ చేశారు. ’రామచంద్రకీ జై’ అంటూ దివ్యమైన రూపంలో గర్భగుడిలో కొలువుదీరిన బాలరాముడిని దర్శించుకుంటున్న ఫొటో, ఆలయం చిత్రాలను అభిమానులతో పంచుకున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments