జనవిజయంసినిమానరసరాజు సలహాను పట్టించుకోని సావిత్రి

నరసరాజు సలహాను పట్టించుకోని సావిత్రి

ప్రముఖ నటి సావిత్రి దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘చిన్నారి పాపలు’. దీనికి ఎలాగైనా ప్రముఖ రచయిత డి.వి.నరసరాజుతో మాటలు రాయించాలని ఆవిడ ప్రయత్నించారు. ఆ చిత్ర నిర్మాణంలో చాలామందికి వాటాలున్నాయని తెలుసుకున్న నరసరాజు ఆ చిత్రానికి పనిచేయడానికి నిరాకరించారట. అంతేకాదు – పదిమందిని వెంటబెట్టుకుని చిత్ర నిర్మాణం జోలికి పోవద్దని సావిత్రికి సలహా ఇచ్చారట. భాగస్వామ్యాలు తలనొప్పులు తెచ్చిపెడతాయనీ సావిత్రికి నరసరాజు ఎంతగానో బోధ పరచారట. కానీ ఆవిడ వినకుండా వాటాదారులను నమ్ముకుని చిత్రనిర్మాణంలోకి దిగిపోయారు. కొంతభాగం పూర్తయిన తర్వాత సావిత్రికి తత్వం బోధపడింది. ఓ సారి నరసరాజు ఎదురైనప్పుడు ‘మీరు ఊహించిన ఇబ్బందులన్నీ నన్ను చుట్టుముట్టి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి’ అంటూ భాగ స్వాముల అలకలు, అభ్యంతరాల గురించి చెప్పుకొన్నారట. చివరకు ‘చిన్నారి పాపలు’ చిత్రానికి సంబంధించిన ఆర్థిక వ్యవహారాలను సైతం తలకెత్తుకోవాల్సిరావడంతో సావిత్రి సొంత ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చిందట. ఆ తర్వాత కూడా చిత్ర నిర్మాణాలు ఆవిడకు కలిసి రాలేదు. తెలుగులో ‘వింత సంసారం’, ‘మూగమనసులు’ తమిళ వెర్షన్‌ ‘ప్రాప్తం’ సావిత్రిని ఇబ్బంది పెట్టాయి.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి