జనవిజయంఆంధ్రప్రదేశ్అవినీతిని చెండాడమంటే కక్ష సాధింపేనా? పాలించే పద్ధతి ఇదేనా?

అవినీతిని చెండాడమంటే కక్ష సాధింపేనా? పాలించే పద్ధతి ఇదేనా?

దేశంలో రాజకీయ కక్ష సాధింపులకే పాలకులు పరిమితం అవుతున్నారు. తమకు అనుకూలంగా లేని వారిని అణిచివేయడం, రాజకీయంగా అణగదొక్కడం, కేసులు పెట్టడం వంటివి సాగుతున్నాయి. కేంద్రంలో మోడీ అధికారంలోకి వచ్చాక ఇలాంటి కేసులు ముమ్మరం అయ్యాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే తంతు కొనసాగుతోంది. తమకంటే ముందున్న పాలకులు చేసిన అవినీతిని వెలికి తీయాల్సిందే. వారి తప్పులను తిరగదోడాల్సిందే. ప్రజాధనాన్ని దోచుకున్న వారిని కఠినంగా శిక్షించాల్సిందే. అయితే ఇది చట్టబద్ధంగా సాగాలి. కానీ కేవలం కక్షసాధింపుగా సాగరాదు. సుప్రంకోర్టు సూచినంచినట్లు రాజకీయ నాయకులపై ఉన్న అవినీతి కేసులను ఏడాదిలోగా అవసరమైతే ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసి పరిష్కరించాలి. అవినీతి అన్నది గతం.. ఇప్పుడన్న పరిమితి.. లేకుండా నడుస్తున్న కాలానికి కూడా వర్తించేలా చేయాలి. ఈ విషయంలో లోక్ పాల్ ఏర్పాటు చేయాలన్న అన్నాహజారే డిమాండ్ ను ఎందుకు పక్కన పెట్టారో చెప్పాలి. అవినీతి జరిగితే వణుకు పుట్టేలా చట్టాలను అమలు చేయాలి. పాలన అంటే దోచుకోవడం కాదని నిరూపించాలి. కానీ అలా కాకుండా ప్రత్యర్థులను వేధించడమే లక్ష్యంగా సాగుతున్న కేసులు రోత పుట్టిస్తున్నాయి. కేవలం కక్ష సాధింపు లక్ష్యంగా రాజకీయ పార్టీల నేతలు వ్యవహరిస్తున్నారు. మొత్తంగా రాజకీయాలలో కక్ష సాధింపులు హద్దులు మీరుతున్నాయి. ఎపిలో జగన్ అధికారంలోకి వచ్చాక ఇలాంటి కేసులు మితిమీరి పోయాయి. ప్రత్యర్థి పార్టీలకు చెందిన వారిపైనా, తనను విమర్శించే వారిపైనా అదేపనిగా వరుసగా కేసులు నమోదు చేయడం, అరెస్ట్లు చేయడం, జైలుకు తోయడం అన్నది ఓ పనిగా సాగుతోంది. అందుకే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ ఎవరిని తోస్తారు అన్న చర్చ సాగుతోంది. తెలంగాణలో కూడా సిఎం కెసిఆర్ తక్కువేం తినలేదు. అవినీతి పేరిట గతంలో రాజయ్యకు ఉద్వాసన పలికారు. ఇప్పుడు ఈటెలను సాగనంపారు. పార్టీలో తనను ఎదిరించే వారు లేకుండా చేసుకునే క్రమంలో ఆయన తీరు ఉంది. ఈటెల భూమలుపై తక్షణ విచారణు ఆదేశించారు. అలా అయితే.. ఫిర్యాదు వచ్చిన భూమలన్నింటిపైనా విచారణకు ఆదేశించి బడుగు బలహీన వర్గాలకు కూడా తక్షణ న్యాయం చేస్తే అందరూ అభినందిస్తారు. ఇక ఇటీవల ఎపిలో చోటుచేసుకుంటున్న వ్యవహారాలు జుగప్స కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఒక ఎంపీ అని కూడా చూడకుండా రఘురాజును కస్టడీలో కొట్టడం, కేసులు పెట్టి వేధించడం అన్నది ఓ పద్ధతి ప్రకారం, కక్ష సాధింపుతో చేసిన పని తప్ప మరోటి కాదని ప్రపంచమంతా గుర్తించింది. అధికారంలో ఉన్నందున మొత్తం పోలీసు వ్యవస్థ ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ముందు మోకరిల్లడం వల్ల తదుపరి పరిణామాలను వారు గుర్తించడం లేదు. భవిష్యత్తులో పరిస్థితులు తిరగబడితే పోలీసులు జవాబుదారీ కావాల్సి ఉంటుంది. లోకసభ స్పీకర్ ఈ ఘటనను సీరియన్ గా తీసుకుంటే కూడా పరిస్థితి మరోలా ఉంటుంది. అయితే ఇక్కడ రఘురామరాజు అత్యున్నత విలువలు కలిగిన రాజకీయవేత్తగా ఏమి గుర్తించడం లేదు. ఆయన రచ్చబండ పేరుతో చేసిన విమర్శలు బండబూతులుగా ఉంటున్నాయి. ఆయన కూడా హుందా కలిగిన రాజకీయవేత్త కాదని ఆయన మాటలు చూసిన వారు ఎవరైనా అంటారు. అలా అని ముఖ్యమంత్రిని తిట్టినందుకు రాజద్రోహం కేసు పెడతారా? అన్నదే ప్రశ్న. ఇదొక్కటే కాదు.. దేవినేని ఉమ, ధూళిపాళ్ల నరేంద్ర, కొల్లు రవీంద్ర, అచ్చన్నాయుడు, చంద్రబాబు ఇలా వరుస పెట్టి అందరిపైనా ఏదో ఒక కేసు పడుతున్న తీరు జగన్ కు ఉన్న కక్షసాధింపు ధోరణికి నిదర్శనంగానే చూడాలి. ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ అధికారానికి వ్యవహారంలో అనేక మంది కోర్టు గడప దొక్కి ఊచలు లెక్కించారు. ఇలా ఏదిపడితే అది చేస్తున్న అధికారులందరికీ ఇది ఒక హెచ్చరిక. పరిధులు దాటి అధికార పార్టీ పక్షాన రెచ్చిపోయిన అధికారులు తదుపరి కాలంలో మూల్యం చెల్లించుకోక తప్పదు. ఎమర్జెన్సీ తరవాత ఏం జరిగిందో కూడా అధికారులు ఆలోచన చేయాలి. పాలకులు విపరీత పోకడలకు పోతే వారిని నుతిమెత్తగా హెచ్చరించాలి. చట్టాలను, న్యాయాలను, కోర్టుల గురించి తెలియ చేయాలి. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి విధానాలను విమర్శిస్తున్నంత మాత్రాన రాజద్రోహం కాదు. అమరావతిని తప్పించాలనడం, కొత్తగా మూడు రాజధానులనడం ఎవరు కూడా సమ్మతించడం లేదు. ఇదంతా పెద్ద మాయగా ఉంది. ఆయన ప్రభుత్వం అసంబద్ధ నిర్ణయాలు తీసుకుంటున్నందునే న్యాయ స్థానాల్లో ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. జగన్ రెడ్డి తప్పులను ఎత్తి చూపితే తెలుగుదేశం అనుకూలురని విమర్శించడం మంచిది కాదు. అమరావతి రాజధాని విషయమే కావచ్చు..సంగం డెయిరీయే కావచ్చు, టిడిపి నేతల అరెస్టులే కావచ్చు.. ఇవన్నీ కూడా ఓ పద్ధతి ప్రకారం, కక్షసాధింపు ధోరణిలో సాగినవే అన్న అభిప్రాయం సామాన్యుల్లో సైతం కలిగింది. అలా కాకుండా నిజాయితీగా అన్యాయాన్ని ఎండ గట్టేందుకు చర్యలకు పూనుకుంటే ఎవరికి అభ్యంతరం ఉండదు. తెలంగాణలో అనేకానేక అక్రమాలు వెలుగు చూస్తున్నా వాటిపై విచారణ లేదు. ఒక్క ఈటెల రాజేందర్ వ్యవహారమే నిఎం కెసిరక్ కు కనిపించడం రాజకీయ కక్ష తప్ప మరోటి కాదు. ఇకపోతే మోడీ తీరు కూడా తక్కువేం లేదు. ఆదానీ, ఆంబానీలకు మేలు చేసేలా నిర్ణయాలు తీసుకుని అప్పనంగా దేశం సంపదను దోచి పెట్టడం రాజద్రోహమే కాదు.. దానిని ఏమైనా అనొచ్చు. అలాంటి వ్యక్తి పాలనలో దేశంల ఎంతగా తల్లడిల్లుతున్నదో కరోనా వేధిస్తున్న వేళ కథలు కథలుగా ప్రజలు తెలుసుకుంటున్నారు. తాను సచ్చీలుడను అని తనకు తాను చెప్పుకోవడం కన్నా ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకుంటే మంచిది. అవినీతిపై పోరాటంలో పాలకులు గతి తప్పితే ప్రజలు ఎప్పటికైనా గుర్తించి వాతలు పెటట్టం ఖాయం.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి