Thursday, October 5, 2023
Homeవార్తలుఅవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నతంగా ఎదగాల

అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నతంగా ఎదగాల

అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నతంగా ఎదగాలి

  • యువతకు జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ పిలుపు

ఖమ్మం, జూలై 25(జనవిజయం):

యువత అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నతంగా ఎదగాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. మంగళవారం నగరంలోని యస్.బి.ఐ.టి. ఇంజనీరింగ్ కళాశాలలో 2019-2023 సంవత్సరపు విద్యార్ధుల గ్రాడ్యుయేషన్ డే వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని, విద్యార్థులకు సందేశమిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బ్రాంచ్ ఏదైనా చేరవలసిన లక్ష్యాన్ని మరువకూడదన్నారు.

జీవితమే ఒక పోరాటమని, ప్రతి రోజు ఏదో ఒక సమస్యతో పోరాడుతుంటామని, క్రియాశీలక వ్యక్తిత్వాన్ని అలవర్చుకొని అవరోధాలను అధికమించాలని తెలిపారు. సమాజంలో ఉన్నతంగా ఉండాలంటే శాస్త్ర సాంకేతిక రంగంలో రాబోయే మార్పులకు అనుగుణంగా విద్యార్థులు నూతన సాంకేతిక పరిజ్ఞానంపై శిక్షితులై ఉండాలని అన్నారు. ఒకప్పుడు సి.ఎ.సి. లో ఒక గ్రూప్ మాత్రమే ఉండేదని, కాని ఇప్పుడు బి.టెక్., లో సి.య.సి.. ఎ.ఐ, యమ్.యల్., డాటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ ఇలా సి.య.సి. లోనే మరెన్నో గ్రూపులు చేరాయన్నారు. విద్యార్థులు వాటికి అనుగుణంగా తమను మార్చుకోవాలన్నారు. నిత్య విద్యార్థిలో నేర్చుకోవాలనే తపన ఉండాలని కలెక్టర్ అన్నారు.

కార్యక్రమంలో పాల్గొన్న ఖమ్మం మున్సిపల్ కమీషనర్ ఆదర్స్ సురభి మాట్లాడుతూ, విద్యార్థులు డబ్బు వెనుక పరుగెత్తకుండా నూతన ఆవిష్కరణలపై దృష్టి పెడితే అవే డబ్బును తెచ్చి పెడతాయన్నారు. లక్ష్యాన్ని పెద్దదిగా పెట్టుకొని దానిని సాధించేందుకు భౌతికంగా దృఢంగా ఉంటే మానసికంగా కూడా అభివృద్ధి చెందుతామని, జీవితంలో ప్రణాళికలను ఏర్పర్చుకొని దానిని పొందే వరకు శ్రమించాలని తెలిపారు.

కార్యక్రమంలో కళాశాల ఛైర్మన్ గుండాల కృష్ణ మాట్లాడుతూ, విద్యార్థుల కోరిక మన్నించి గ్రాడ్యుయేషన్ డే కి అనుమతించడం జరిగిందన్నారు. విద్యార్థులు నైపుణ్యంతో కూడిన విద్య నేర్చుకున్నపుడే, ఆ విద్యకు సార్ధకత చేకూరుతుందన్నారు. కళాశాల విద్యార్థులు అందరూ చుదువుతో పాటు యమ్.ఎన్.సి. కంపెనీలలో ఉద్యోగం సాధించాలన్నదే తమ లక్ష్యమని అన్నారు. ఎస్బిఐటి విద్యార్థులు 293 పైగా ప్లేస్ మెంట్లు సాధించి కళాశాల గర్వపడే స్థాయికి తెచ్చినందుకు వారికి అభినందనలు తెలిపారు. ప్రతి విద్యార్థి కనీసం ఒక ఉద్యోగంతో కళాశాలను వీడాలన్నదే తమ లక్ష్యమని ఆ దిశగా విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ప్లేస్మెంటుకు తగిన శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా విద్యార్థులు తమ ప్రత్యేకమైన నైపుణ్యాలను పెంపొందించుకొని దేశ భవిష్యత్తుకు తోడ్పడతామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా మెరిట్ సాధించిన విద్యార్థినీ విద్యార్థులకు మెడల్, సర్టిఫికెట్ల ప్రదానం చేశారు.

ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డా. జి. ధాత్రి, ప్రిన్సిపాల్ డా. జి. రాజ్ కుమార్, వైస్ ప్రిన్సిపల్ గంధం శ్రీనివాసరావు, ఎకడమిక్ డైరెక్టర్స్, డా. ఎ.వి.వి. శివ ప్రసాద్, జి. ప్రవీణ్ కుమార్, డా. జి. సుభాష్ చందర్, డా. జె. రవీంద్రబాబు, వివిధ విభాగాల హెచ్.ఒ.డిలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments