Tuesday, October 3, 2023
Homeవార్తలుపూర్తి అవగాహనతో ఎన్నికల విధులు నిర్వహించాలి

పూర్తి అవగాహనతో ఎన్నికల విధులు నిర్వహించాలి

ఖమ్మం, జూలై 18(జనవిజయం):

శిక్షణా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని, ఎన్నికల విధుల పట్ల పూర్తి అవగాహన కలిగి, విధులు సమర్థవంతంగా నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. మంగళవారం డిపిఆర్సీ భవనంలోని సమావేశ మందిరంలో జిల్లా స్థాయి మాస్టర్ శిక్షకులచే, నియోజకవర్గ స్థాయి మాస్టర్ శిక్షకులకు ఏర్పాటుచేసిన బూత్ స్థాయి అధికారులు, ఫోటో ఎలక్టోరల్ రోల్ స్పెషల్ సమ్మరి రివిజన్-2023పై శిక్షణ, అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,  రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని సమర్దవంతమైన, స్పష్టమైన ఎలక్టోరల్  రోల్ ను  తయారు చేయాలని అన్నారు.  పారదర్శకమైన ఎన్నికల జాబితా తయారు చేయాలని, ఓటర్ల జాబితాలో మార్పులు చేయడంలో జాగ్రత్త వహించాలని సూచించారు.  ఇంటింటి సర్వే ద్వారా ఓటర్ల జాబితాను నిర్దారించాలని, గరుడ (బిఎల్ఓ) యాప్ లో వివరాల నమోదు సక్రమంగా జరిగేలా చూడాలని, అందరూ బూత్ స్థాయి అధికారులు గరుడ యాప్ ను ఉపయోగించే విధంగా చూడాలని ఆయన తెలిపారు. ప్రతిసారి చేసే సమ్మరి రివిజన్ లో లోటుపాట్లు సరిదిద్దుకొని ఏ దశలోను తప్పిదాలకు తావులేకుండా ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. పోలింగ్ స్టేషన్లను సందర్శించి అన్ని సౌకర్యాలు ఉన్నాయా, లేదా చూసుకోవాలని తెలిపారు. పొలిటికల్ పార్టీ కార్యాలయాలకు 2 కి.మి. దూరంలో, ఓటర్లకు సమీపంగా పోలింగ్ కేంద్రాలు ఉండేలా జాగ్రత్త వహించాలన్నారు. చనిపోయిన ఓటర్ల విషయంలో ఖచ్చితంగా మరణ దృవీకరణ పత్రాన్ని పొంది, కుటుంబ సభ్యుల ద్వారా వాకబు చేసిన తరువాతే ఓటరు జాబితా నుండి వివరాలను తొలగించాలన్నారు.  అనాధలు, ఒంటరి, కూలీ కొసం ఊరురూ తిరిగే వారి వివరాలను కూడా సేకరించి వారి స్థిర చిరునామా ఆధారంగా ఓటరుగా నమోదు చేయాలన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతిఒక్కరిని ఓటరుగా నమోదు చేయాలని, పోలింగ్ కేంద్రం పరిధిలో ఓటరుగా ఉన్న ప్రతి ఒక్కరి ఫోటో, వివరాలు సరిగా ఉండాలన్నారు.   పోలింగ్ కేంద్రాల వద్ద వికలాంగులు, వృద్దుల కొరకు ర్యాంపులతో పాటు ఇతర మౌళిక సదుపాయాలను ఖచ్చితంగా కల్పించాలని అన్నారు.
ఈ సందర్భంగా ఎన్నికల ప్రక్రియ పై, బూత్ స్థాయి అధికారుల విధులు, బాధ్యతలు, ఫోటో ఎలక్టోరల్ రోల్స్ 2వ ఎస్ఎస్ఆర్-2023 పై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో ఖమ్మం మునిసిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్, శిక్షణ సహాయ కలెక్టర్ రాధిక గుప్తా, జెడ్పి సిఇఓ అప్పారావు, జిల్లా ఉపాధికల్పనాధికారి శ్రీరామ్, ఎస్డీసి దశరథం, ఖమ్మం మునిసిపల్ కార్పొరేషన్ ఉప కమీషనర్ మల్లీశ్వరి, తహశీల్దార్లు, నాయబ్ తహశీల్దార్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments