అత్యవసర సమావేశానికి ప్రజాప్రతినిధుల డుమ్మా!
- గత కొంత కాలంగా ఇదే దుస్థితి”ప్రజా సమస్యలు గాలికే!
- అధికారుల,ప్రజా ప్రతినిధుల మధ్య సమన్వయం కొరవడిందా?
- 34 కు కేవలం 8 మందే హాజరు!
వేంసూరు,జూలై 27(జనవిజయం):
భారీ వర్షాల నేపథ్యంలో ఖమ్మం జిల్లాను రాష్ట్ర ప్రభుత్వం రెడ్ జోన్ గా ప్రకటించినందున జిల్లా కలక్టర్ గురువారం మండల పరిషత్ అత్యవసర సమావేశం నిర్వహించాలని బుదవారం ఆదేశాలు జారీ చేయగా జిల్లాలోని వేంసూరు మండల అత్యవసర సర్వ సభ్య సమావేశం గురువారం ఉదయం 11 గంటలకు జరుగుతుందని ప్రజాప్రతినిదులకు, మీడియాకు బుదవారం మండల పరిషత్ కార్యాలయం సిబ్బంది సమాచారం ఇచ్చారు. అత్యవసర సమావేశానికి గురువారం 22 మంది సర్పంచులు,12 మంది ఎంపీటీసీ లు రావాల్సి ఉండగా కేవలం సర్పంచులు 4 గురు, ఎంపిటిసి లు 4 గురు మాత్రమే హాజరు అయ్యారు. మిగిలిన 26 మంది ప్రజాప్రతినిధులు డుమ్మా కొట్టారు. ఇది ఇప్పుడే కాదు గత కొంత కాలంగా జరుగుతున్న మార్పు కోసం కృషి చేసిన పరిస్థితి లేదని మనకు ఇట్టే అర్థమవుతుంది. ఈ దుస్థితి కొనసాగడంతో ప్రజా సమస్యలను పట్టించుకోకుండా మండల పరిషత్ అధికారులు గాలికొదిలేసిన పరిస్థితి ఏర్పడింది.
అధికారుల, ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయం పూర్తిగా కొరవడిందని, సమస్యలపై చర్చ చేసినా కొన్ని శాఖలలో పనులు జరగడం లేదని, అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని, దశాబ్ది వేడుకల నిర్వహణ గ్రాంట్ సొమ్ము వచ్చి రోజులు గడిచినా ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వలేదని ఓ పత్రికలో వార్త వచ్చాక హుటాహుటీన పంపిణీ చేస్తామని కబురులు చేశారని కొందరు ప్రజా ప్రతినిధులు బాహాటంగా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది.
ఈ సమావేశంలో పాల్గొన్న ఎంపీడీఓ గడ్డం రమేష్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్యదర్శులు గ్రామాలలో అంటూ వ్యాధులు ప్రబలకుండా బ్లీచింగ్,దోమల మందు పిచికారి చేసేలాచూడాలని,త్రాగునీటిని కలుషితం కాకుండా చూడాలని ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకోవాలని అన్నారు.అనంతరం ఎంపిపి పగుట్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అను నిత్యం గ్రామాలలో ప్రజలకు అందుబాటులో వుండాలని,వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది వైరల్ జ్వరాలు,దగ్గు,జలుబులతో ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉందని గృహ సందర్శనకు వెళ్ళాలని సూచించారు.గ్రామాలలో వున్న వాగులు,చెరువులకు ఉన్న ఆనకట్టలు ఎప్పటికప్పుడు పరీక్షించాలని అన్నారు.
ఈ సమావేశంలో ఐసిడిఎస్ సిడిపిఓ కొండమ్మ,గ్రామ పంచాయతీ కార్యదర్శులు,మండల వైద్యాధికారి ఇందు ప్రియాంక, ఐకేపీ ఏపిఎం బొమ్మా శ్రీనివాస్, మండల వ్యవసాయ శాఖ అధికారి రాoమోహన్,జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్,ఆర్ డబ్ల్యు ఎస్ జె ఈ జయలక్ష్మి లతో పాటు కొన్ని శాఖల అధికారులు,రామన్నపాలెం సర్పంచ్ నాగుల్ మీరా, వేంసూరు ఎంపిటిసి నాయుడు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

