బదిలీపై వెళ్తున్న అధికారులకు ఆత్మీయ వీడ్కోలు
ఖమ్మం, జూలై 22(జనవిజయం):
జిల్లాలో సుదీర్ఘ కాలం విశిష్ట సేవలందించి, బదిలీపై వెళ్తున్న రెవిన్యూ అధికారులు అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్, జిల్లా రెవిన్యూ అధికారిణి ఆర్.శిరీష, ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ ఆర్. దశరథ్, ఖమ్మం ఆర్డీవో ఎం. వి. రవీంద్రనాథ్, కల్లూరు ఆర్డీవో సిహెచ్. సూర్యనారాయణ ఆత్మీయ వీడ్కోలు సమావేశం తెలంగాణ రెవిన్యూ సర్వీసెస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక పార్క్ రెస్టారెంట్ (గొరిల్లా పార్క్ ప్రక్కన)లో ఘనంగా జరిగింది.
సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ బదిలీపై వెళ్తున్న రెవిన్యూ అధికారుల సేవలను కొనియాడారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, రెవిన్యూ అధికారులు, ఉద్యోగ సంఘ నేతలు తదితరులు పాల్గొన్నారు.