జనవిజయంతెలంగాణఆత్మగౌరవం కాదు.. ఆస్తుల మీద గౌరవం - ఈటెల వ్యాఖ్యలపై విరుచుకుపడ్డ పల్లా రాజేశ్వర రెడ్డి

ఆత్మగౌరవం కాదు.. ఆస్తుల మీద గౌరవం – ఈటెల వ్యాఖ్యలపై విరుచుకుపడ్డ పల్లా రాజేశ్వర రెడ్డి

  • తల్లి పాలు తాగాక రొమ్ముగుద్దే రకం ఈటెలది
  • అసైన్డ్,దేవాలయ భూములు ఎలా కొంటారు?
  • ఉద్యమ పార్టీకి ద్రోహం చేయడం ఆయనకే చెల్లింది
  • కెసిఆర్ తరవాత అన్ని ఉన్నత పదువులు అనుభవించారు
  • కులాల పేరుతో చిచ్చు పెడితే ప్రజలు నమ్మరు 

హైదరాబాద్, జూన్ 4(జనవిజయం) : బాధ్యత గల మంత్రి పదవిలో ఉండి చట్ట వ్యతిరేకమైన దేవాదాయ భూములు, అసైన్డ్ భూములను ఎలా కొంటారని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన మీడియా సమక్షంలో..మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. వచ్చే పది రోజుల్లో బీజేపీలో ఈటల కనుమరుగవుతారని వ్యాఖ్యానించారు. ధాన్యం సేకరణ అనేది కచ్చితంగా ప్రభుత్వం చేయాల్సిన పని కాదన్నారు. ఈటల ధాన్యం కొనమంటే సీఎం కేసీఆర్ వద్దన్నారంటూ అసత్యాలు ప్రచారం చేస్తున్నారన్నారు. రైతు వ్యతిరేక చట్టాలకు పాల్పడుతున్న బీజేపీలో చేరే ముందు ఒకసారి ప్రశ్నించాలని ఈటలకు పల్లా సూచించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో ప్రతి గింజనూ ప్రభుత్వం కొంటుందన్నారు. ఇవాళ రాష్ట్రంలో అమలవుతున్న ప్రతి ప్రథకం కేసీఆర్ మదిలో నుంచి పుట్టిందేనన్నారు.

కరోనా రివ్యూలో తాను లేకుండా సీఎం ఒక్కరే చేశారంటూ ఈటల చేసిన ఆరోపణలు అవాస్తవం కాదా అని ప్రశ్నించారు. నిరంతరం ముఖ్యమంత్రి మానిటరింగ్ చేస్తూ ఈటలకు ఇబ్బంది కాకుండా చూశారని పల్లా తెలిపారు. వారు మంత్రిగా ఉన్నప్పుడు ఎన్సీ, ఎస్టీ అధికారులను ఎలా ఇబ్బందులకు గురి చేశారో వారికే తెలుసన్నారు. మీరు మంత్రిగా చేసిన శాఖపై మీకు కనీస అవగాహన  ఉందా? అని ప్రశ్నించారు. కులాల మధ్య కుంపట్లు పెట్టే ఆలోచన మానుకోవాలన్నారు. టీఆర్ఎస్ పార్టీలో మీకు దక్కినన్ని పదవులు ఎవరికీ దక్కలేదని ఈటలను ఉద్దేశించి పల్లా వ్యాఖ్యానించారు. ఈటల రాజేందర్ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు కౌంటర్ ఇచ్చారు. ఈటల తల్లిపాలు తాగి రొమ్ముగుద్దే రకమని వ్యాఖ్యానించారు. కన్నతల్లిలాంటి పార్టీపై ఈటల అభాండాలు వేశారని ఆయన మండిపడ్డారు.

తెలంగాణ ఉద్యమ ఎజెండా రూపొందించింది కేసీఆర్. నాయకత్వ లక్షణాలు లేకున్నా ఈటలను కేసీఆర్ అక్కున చేర్చుకున్నారు. ఈటలకు ఎన్నో పదవులు ఇచ్చి గౌరవించారు. పార్టీలో ఉన్నప్పుడు దేవుడన్నారు.. ఇప్పుడేమో నియంతా? అంటూ పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. బడుగుబలహీన వర్గాలకు చెందిన భూములను ఈటల ఎలా కొంటారు?. అనామకుడి ఫిర్యాదుపై సీఎం స్పందించారంటే అది ప్రజాస్వామ్యం గొప్ప. ఈటలకు ఆత్మగౌరవంపై కాదు.. ఆస్తులపై గౌరవం ఉంది. చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికే ఆత్మగౌరవ నినాదం. అధికారులను వాడుకుని వారిపైనే నిందలు మోపుతున్నారని పల్లా నిప్పులు చెరిగారు. ఆస్తులను రక్షించుకోవడానికే ఈటల రాజేందర్ ప్రయత్నాలని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు దుయ్యబట్టారు. ఢిల్లీలో ఉన్నవాళ్లు కూడా ఈటలను కాపాడలేరన్నారు. ప్రగతి భవన్ లో అడుగుపెట్ట నివ్వలేదంటూ ఈటల దిగజారుడు మాటలు బడుగు బలహీన వర్గాలు విశ్వసించరని బాలరాజు అన్నారు.

ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంవ్యవసాయంప్రముఖులువీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యజర్నలిజంఎడిటర్ వాయిస్వికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంన్యాయంసమాజంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి