జనవిజయంఆంధ్రప్రదేశ్ఆటవిక పాలన అంటే చంద్రబాబుదే

ఆటవిక పాలన అంటే చంద్రబాబుదే

అమరావతి, మే 19 (జనవిజయం): చంద్రబాబు పాలనలో అరాచక, ఆటవిక పాలన సాగిందని, ఆయన అధికారంలో ఉండగానే పైర హక్కులకు భంగం కలిగిందని వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. రఘురామకృష్ణరాజు అరెస్టుపై టీడీపీ అనవసర యాగీ చేస్తోంది. రఘురామను అడ్డంపెట్టుకొని చంద్రబాబు కుట్ర చేయాలనుకుంటున్నారు. ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని టీడీపీ కుట్రలు చేస్తుందని ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. రఘురామకృష్ణరాజు వైయస్‌ఆర్‌సీపీ తరఫున లోక్‌సభకు ఎన్నికై ఆ తరువాత ఏడాది నుంచి పార్టీకి వ్యతిరేకంగా విమర్శలు చేస్తున్నారని, పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడటంతో ఇప్పటికే లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేశామన్నారు. ఆయన్ను సస్పెండ్‌ చేయాలని లోక్‌సభ సీకర్‌కు లేఖ కూడా రాశామని, ఇలాంటి చర్యలు అన్ని పార్టీలు తీసుకుంటున్నాయని చెప్పుకొచ్చారు.

‘‘రఘురామకృష్ణరాజు వరుస పెట్టి ముఖ్యమంత్రిపై, ప్రభుత్వంపై విమర్శలు మొదలుపెట్టారు. వైయస్‌ జగన్‌కు వ్యతిరేకంగా పని చేస్తున్న శక్తులతో కలిసి విమర్శలు చేస్తున్నారు. ఇది ఒవర్‌ నైట్‌లో వచ్చిన పరిస్థితి కాదు. దీనికి ఏడాది క్రితం నుంచే స్కేచ్‌ వేశారు. స్పీకర్‌ ఆయనపై సస్పెన్షన్‌ వేటు వేయకపోవడంతో ఆయన రోజు రోజుకు శృతిమించి మాట్లాడుతున్నారు. వైయస్‌ జగన్‌ పార్టీ పెట్టిన పదేళ్ల నుంచి ఇలాంటి వ్యక్తులను ఎదుర్కొంటున్నారు. ప్రజల్లోకి వెళ్లి కష్టసుఖాలు చెప్పుకుంటున్నారు. ఆ క్రమంలోనే పార్టీ అధికారంలోకి వచ్చింది. వైయస్‌ జగన్‌ను ప్రజలు ఆశీర్వదించి ముఖ్యమంత్రిని చేశారు. దీంతో ఆయనపై బాధ్యత మరింత పెంచారు. రెండేళ్ల పాలనలో ప్రజలకు రావాల్సిన హక్కులపై విచక్షణపై ఆధారపడకూడదని, అర్హత ఉంటే చాలు సంక్షేమ పథకాలు అందజేస్తున్నారు. అధికార దుర్వినియోగం అనే మాటే రాలేదు. ఏదైతే వరుసగా రాష్ట్రంలో ఒకరకమైన అస్థిరత క్రియేట్‌ చేసేందుకు టీడీపీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ప్రజల విశ్వాసంతో వరుసగా జరుగుతున్న ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సీపీ విజయం సాగిస్తుంది. ప్రభుత్వాన్ని ఎదుర్కొనే శక్తి లేక, ప్రజలకు సేవ చేస్తున్న ముఖ్యమంత్రిని ఎదుర్కొలేక దయనీయమైన స్థితిలో ఉన్న టీడీపీ అడ్డదారుల్లో ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు వివిధ వర్గాల మధ్య గొడవలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందేందుకు రఘురామకృష్ణంరాజును ముందుకు తోశారు. వివిధ వర్గాల నుంచి ఫిర్యాదులు రావడం, సీఎం గురించి వీళ్లు నోటికి వచ్చినట్లు మాట్లాడిన సందర్భాలు ఎన్నో ఉన్నా కూడా వైయస్‌ జగన్‌ పట్టించుకోలేదు. కోట్లమంది అభిమానులు, లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నా ఎక్కడా రెచ్చగొట్టలేదు. వైయస్‌ జగన్‌ నిగ్రహం, సంయమానం పాటిస్తున్నారు. ఈ క్రమంలో రఘురామకృష్ణరాజుపై సీఐడీ సుమోటోగా కేసు నమోదు చేయడం, ఆ తరువాత పరిణామాలు గమనించాలి.’’ అని అన్నారు.

‘‘చట్టం తన పని తాను చేసుకుంటూపోతోంది. ఇందులో ఎవరూ గొడవ పడాల్సిన అవసరం లేదు. టీడీపీకి తెలిసిందే అడ్డదారులు, అరాచక పాలన. ప్రజాస్వామ్యవాదులను గౌరవించాల్సిందే. ఏ ప్రభుత్వమైన తన అధికారాలు, బాధ్యతలు వినియోగించేందుకు ప్రోటెక్షన్‌ ఉంటుంది. ఈ సంఘటనలో ఎక్కడ దుర్వినియోగం అయ్యిందో చెప్పాలి. రఘురామకృష్ణరాజు బెయిల్‌ కోసం కింది కోర్టుకు వెళ్లమని హైకోర్టు ఆదేశించింది. అక్కడి నుంచి ఆయన పాదాలకు గాయాలు అంటూ మరో ఎపిసోడ్‌ మొదలైంది. సీఐడీ అధికారులు షిల్డ్‌ కవర్‌లో హైకోర్టుకు నివేదిక ఇచ్చారు. ఇందులో సీఎం వైయస్‌ జగన్‌ ప్రమేయం ఎక్కడ ఉందో చెప్పాలి. రఘురామకృష్ణంరాజు అనే వ్యక్తి ఏ పార్టీ తరఫున గెలిచారో అందరికి తెలుసు. ఆయనకు నచ్చపోతే పార్టీకి, ఎంపీ పదవికి రాజీనామా చేయాలి. లేదా స్పీకర్‌ ఆయనపై సస్పెండ్‌ చేయాలి. సీఐడీ మూవ్‌ అయిన తరువాత కోర్టు పరిధిలోకి వెళ్లింది. ఆయనను హత్య చేస్తారని, కొట్టారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదేమైన జరిగితే ఆయన తరఫున లాయర్‌ ఎందుకు కోర్టు దృష్టికి తీసుకెళ్లలేదు. నిజంగా సీఐడీ ఏదైన చేస్తే ఆయన మనుషులు వచ్చి కలుస్తున్నారు. భోజనాలు పెడుతున్నారు. మధ్యాహ్నం హైకోర్టులో బెయిల్‌ నిరాకరించడంతో ఎపిసోడ్‌ ప్రారంభమైంది. ఎక్కడా ప్రభుత్వ ప్రమేయం లేదు. లేదు కాబట్టే ఇంత చర్చ జరుగుతోంది. పారదర్శకరంగా అందరూ కలుస్తున్నారు. ఒకపక్క రాజు మీసం మేలెస్తున్నారు. మరోపక్క అరికాళ్లపై నడుస్తున్నారు.’’ అని వ్యాఖ్యానించారు.

‘‘ప్రభుత్వం ఈయన విషయంలో ఎక్కడైనా కుట్రపూరితంగా వ్యవహరించిందా? ఎక్కడా లేదే. ప్రజలను పక్కదోవ పట్టించేందుకు పచ్చ మీడియా ప్రయత్నం చేస్తోంది. దానికి బేస్‌ ఉండాల్సిన అవసరం లేదు. దీనివల్ల అసలు విషయం పక్కకు పోతుంది. సీఎం వైయస్‌ జగన్‌ అధికారాన్ని ఎప్పుడు పవర్‌గా భావించడం లేదు. ప్రజలకు సేవ చేసేందుకు వచ్చిన అవకాశంగా భావిస్తున్నారు. ప్రభుత్వంపై, సీఎంపై బురద జల్లుతుండటం దుర్మార్గం. టీడీపీకి ముందునుంచి ఇదే అలవాటు. మిగిలిన వర్గాల కోసమే ఈ వివరణ ఇస్తున్నాం. చంద్రబాబు జూమ్‌లో మాట్లాడుతూ రాజ ద్రోహం అంటే ఎప్పుడు వినలేదని చెప్పారు. తీరా ఆయన హయాంలో పరిశీలిస్తే కేసీఆర్‌పై 12 చోట్ల రాజద్రోహం కేసులు పెట్టించారు. కుట్రపూరితంగా కేసీఆర్‌పై కేసులు బనాయించారు. గుంటూరులో న్యాయవాదులపై కేసులు పెట్టించారు. సాక్షి విలేకరులపై 12 కేసులు పెట్టించారు. అప్పట్లో మా ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిపై మూడు కేసులు పెట్టారు. హోం మంత్రి చిన్నరాజప్ప దిష్టిబొమ్మ దహనం చేయించారని బీజేపీ నేతలపై దేశ ద్రోహం కేసు పెట్టించారు. గుంటూరు ముస్లిం యువకులపై 124బీ కేసు నమోదు చేయించారు.’’ అని గుర్తుచేశారు.

‘‘ప్రజాక్షేత్రంలో ఎదుర్కోవడమే ప్రజల మన్ననలు పొందగలం. అధికారాన్ని ఉపయోగించి ప్రజల మన్ననలు పొందే ఆలోచన వైయస్‌ జగన్‌కు లేదు. ఆ రోజు కేసీఆర్‌పై బుద్ధి ఉండి పెట్టించారా? మీకు సంబంధించిన రెండు చానళ్లలో రచ్చబండ కార్యక్రమం పెట్టి లైవ్‌లో దుర్భాషలాడించారు. ప్రభుత్వంపై బురదజల్లించారు. ఇవన్నీ ప్రజలకు తెలియవా? ఈ కుట్రలో మీరు భాగస్వాములు అయ్యారు కాబట్టే ఈ రెండు చానళ్లపై కేసులు పెట్టారు. జేసీబీ, ఏసీబీ, పీసీబీ అన్నదికూడా ఉందని నేను ఎప్పుడు వినలేదన్నారు. చంద్రబాబు హయాంలో 52 పెద్ద పెద్ద ఇండస్ట్రీస్‌ను తొలగించారు.
ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించాల్సి ఉంటే ఎక్కడైతే స్కామ్‌లు జరిగితే వారిపై కేసులు పెట్టాం తప్ప కక్షపూరితంగా ఎక్కడ కేసులు పెట్టలేదు. రెండేళ్లలో ఎంతో మందిపై కేసులు పెట్టవచ్చు. మీ పార్టీకి చెందిన అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, దూళిపాళ్ల నరేంద్రపై ఆధారాలతో సహా కేసులు పెట్టాం. మీ హయాంలో కక్షసాధింపు జరగలేదని చెప్పగలరా? ఎమ్మార్వోను జుట్టుపట్టుకొని మీ ఎమ్మెల్యే కొడితే చంద్రబాబు పంచాయితీ చేశారు. ఎ్రరచందనం దుంగల కేసు గురించి ఆలోచిస్తే చంద్రబాబు బంఢారం బట్టబయలు అవుతుంది. కూలీలను కాల్చిన కేసును మసిపూసి మారెడు కాయ చేశారు. దాన్ని ఆటవీకం, నియంతృత్వం అంటారు. నీ పబ్లిసిటీ పిచ్చితో 29 మందిని చంద్రబాబు పొట్టన పెట్టుకున్నారు. దానిన అరాచకం అంటారు. నిరంకుశత్వం, రాక్షసతత్వం, అవి నీలో పెట్టుకొని, నీ కుట్రలో భాగంగా ఒక వ్యక్తిని వాడుకొని, ఓ కేసులో మీ పేరు బయటకు వస్తాయన్న భయంతో మీరు రాద్ధాంతం చేస్తూ మొత్తం వ్యవస్థలను వాడుకుంటున్నారు. దయ్యాలు వేదాలు వల్లించినట్లు మాట్లాడుతున్నారు. కమ్యూనిస్టులు కూడా మాట్లాడుతున్నారు. మీ పార్టీలు కూడా కొన్ని రాష్ట్రాల్లో పాలిస్తున్నారు. అక్కడ కూడా ఇదే చట్టం ఉంది. మా పార్టీకి సంబంధించిన వరకు పోరాటాల నుంచి మా నాయకుడు వచ్చారు. ఈ రోజు అధికారంలో ఉన్నారు. ఆయనకు ప్రజా సంక్షేమం తప్ప మరేమి లేదు. ప్రజాస్వామ్యవాదులు, మీడియా మిత్రులు ఇవన్నీ గమనించాలి. కుట్రలకు పాల్పడితే వ్యవస్థ దాని పని అది చేసుకుంటుంది. ఎక్కడా వ్యవస్థను ఒత్తిడికి గురి చేయడం ఉండదని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి