జనవిజయంఆంధ్రప్రదేశ్ఆర్మీ ఆస్పత్రి నుంచి విడుదలయిన రఘురామ

ఆర్మీ ఆస్పత్రి నుంచి విడుదలయిన రఘురామ

నేరుగా ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లిన ఎంపి

హైదరాబాద్, మే26(జనవిజయం): ఎట్టకేలకు సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి నుంచి నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు బుధవారం ఉదయం డిశ్చార్జి అయ్యారు. రఘురామ ఆరోగ్యం కోలుకోవడంతో.. ఆయనను వైద్యులు డిశ్చార్జి చేశారు. అనంతరం బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. ఏపీ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించారనే ఆరోపణల నేపథ్యంలో ఆ రాష్ట్ర సీఐడీ అధికారులు రఘురామను అరెస్టు చేసి గుంటూరుకు తరలించిన సంగతి తెలిసిందే. అయితే తనను సీఐడీ పోలీసులు చిత్రహింసలకు గురిచేశారని పేర్కొంటూ ఎంపీ నేరుగా సుప్రీంలో బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. సుప్రీం ఆదేశానుసారం రాఘురామకృష్ణరాజుని ఆర్మీ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆర్మీ ఆస్పత్రి నివేదిక అనంతరం బెయిల్ పిటిషన్ పై విచారణ సందర్భంగా సుప్రీం రఘురామకృష్ణరాజుకు బెయిల్ ను మంజూరు చేస్తూ ఉత్తర్వులు వెలువరించింది. ఎంపీ ఆరోగ్య పరిస్థితి దృష్యా బెయిల్ మంజూరు చేస్తున్నట్లు సుప్రీం పేర్కొన్న విషయం విదితమే. అయితే మెరుగైన వైద్యం కోసం ఆయన ఢిల్లీకి వెళ్తున్నారు. ఎయిమ్స్ లో వైద్య చికిత్సలు పొందనున్నారు. ఢిల్లీ ఎయిర్ పోర్టుకు రఘురామకృష్ణ రాజు బంధువులు చేరుకున్నారు. ఇదిలా ఉంటే, రఘురామ రాజును విచారించాలంటే 24 గంటల ముందు ఏపీ సీఐడీ అధికారులు నోటీసులు ఇవ్వాలి. సీఐడీ విచారణకు సహకరించాలని సుప్రీంకోర్టు అదేశించింది. సీఐడీ కోర్టులో షూరిటీ పేపర్లు సమర్పించేందుకు రఘురామకు 10 రోజుల గడువు ఇచ్చింది. ఈ 10 రోజుల్లో ఎప్పుడైనా సమర్పించవచ్చని తీర్పులో అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ నెల 14న రఘురామను ఏపీ సీఐడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఎంపీ తనను కొంత మంది కొట్టారని ఆరోపించారు. దీంతో వైద్య పరీక్షలు నిర్వహించాలని కోర్టు సూచించగా.. గుంటూరు జీజీహెచ్ లో నిర్వహించి రిపోర్ట్ అందజేశారు. రఘురామ మాత్రం వైద్య పరీక్షలపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహించాలని ఆదేశించడంతో.. అక్కడ పరీక్షలు నిర్వహించి రిపోర్టులను నీల్డ్ కవర్ లో తెలంగాణ హైకోర్టు ద్వారా సుప్రీంకోర్టుకు అందజేశారు. అనంతరం జరిగిన బెయిల్ పిటిషన్ విచారణలో రఘురామ బెయిల్ పొందారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి