జనవిజయంతెలంగాణఆస్తులు కాదు ఆక్సిజన్ ని వారసత్వంగా అందించండి - బషీరుద్దీన్ పిలుపు

ఆస్తులు కాదు ఆక్సిజన్ ని వారసత్వంగా అందించండి – బషీరుద్దీన్ పిలుపు

  • ఖమ్మం సుందరయ్య భవన్ వద్ద మొక్కలు నాటిన డి.వై.ఎఫ్.ఐ కార్యకర్తలు
  • ముఖ్య అతిధిగా పాల్గొని పర్యావరణ ప్రతిజ్ఞ చేయించిన యు.టి.ఎఫ్ నేత షేక్ రంజాన్
ఖమ్మం,జూన్ 5(జనవిజయం) : భవిష్యత్తు తరాలకు ఆస్తుల్ని కాదు ఆక్సిజన్ ను అందించాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డి.వై.ఎఫ్.ఐ)ఖమ్మం జిల్లా కమిటి  కార్యదర్శి షేక్ బషీరుద్దీన్ పిలుపునిచ్చారు. భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డి.వై.ఎఫ్.ఐ)ఖమ్మం జిల్లా కమిటి ఆధ్వర్యంలో స్థానిక ఎన్.ఎస్.టి రోడ్ సుందరయ్య భవనం వద్ద శనివారం నాడు పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటారు. అనంతరం కార్యకర్తలు పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి షేక్ బషీరుద్దీన్ మాట్లాడుతూ పర్యావరణ దెబ్బ తినడం వలన మానవ మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని, కొత్త రకాల జబ్బులు వస్తున్నాయని అన్నారు. దీనివల్ల భవిష్యత్తు తరాల వారు జివించటమే కష్టంగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన యు.టి.ఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్ రంజాన్ కార్యకర్తలచేత పర్యావరణ ప్రతిజ్ఞ  చేయించారు. రంజాన్ మాట్లాడుతూ డి.వై.ఎఫ్.ఐ ఆధ్వర్యంలో మోక్కలు నాటుతున్నందుకు కార్యకర్తలని అభినందించారు. అందరూ తప్పనిసరిగా మొక్కటు నాటడం అనేది సంప్రదాయంగా మార్చుకోవాలని కోరారు. ఈ  కార్యక్రమం లో  డి.వై.ఎఫ్.ఐ జిల్లా నాయకులు సత్తెనపల్లి నరేష్, గుమ్మా ముత్తారావు, కణతాల వెంకటేశ్వర్లు, జక్కంపుడి క్రిష్ణా, సారంగి పాపారావు, కనపర్తి గిరి, కూరపాటి శ్రీను, గుమ్మడి నర్సయ్య, రామక్రిష్ట,స్వామి తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి