Saturday, February 24, 2024
Homeరాజకీయంఎపిలో అస్పష్ట రాజకీయాలు

ఎపిలో అస్పష్ట రాజకీయాలు

  • పొత్తులే లక్ష్యంగా బిజెపి, జనసేన,టిడిపి
  • వైసిపి పాలనపైనా ప్రజల్లో అసంతృప్తి
  • షర్మిల రాకతో వైకాపాకు ఇరకాటం

అమరావతి,ఫిబ్రవరి10: ఎపిలో అస్పష్ట రాజకీయాలు సాగుతున్నాయి. కులరాజకీయాలకు పావులు కదులుతున్నాయి. పొత్తులే లక్ష్యంగా బిజెపి, జనసేన,టిడిపి ఎత్తులు వేస్తున్నాయి. వైసిపి పాలనపైనా ప్రజల్లో తీవ్ర అసంతృప్తి  నెలకొంది. ఐదేళ్లుగా రాజధాని లేని రాజ్యంగా కొనసాగింది. ఎపిలో వైకాపా అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో బటన్‌ నొక్కడం తప్ప మరో కార్యక్రమం లేదన్న విమర్శలు ఉన్నాయి. మరో రెండు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. వైకాపా పాలన కోసం కుటుంబ సభ్యులంతా పోరాడారు. అక్కడ జరిగిన ప్రచారంలో జయమ్మ, షర్మిల, భారతి కూడా పాల్గొన్నారు. ఎవరికి వారు జగన్‌ను అధికారంలోకి తీసుకుని రావడంలో తమవంతు పాత్ర పోషించారు. ఒక్క ఛాన్స్‌ అంటూ జగన్‌ గద్దెనెక్కారు. అయితే ప్రభుత్వం ఏర్పడ్డ తరవాత సిఎంగా జగన్‌ తన కుటుంబ సభ్యులను అధికార పరిధికి దూరం పెట్టారు.

ఇప్పుడు షర్మిల కాంగ్రెస్‌ అధ్యక్షురాలుగా ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్‌ వదిలిన బాణంగా బయలుదేరారు. షర్మిల ప్రశ్నలకు సమాధానం దొరకడం లేదు. ఆమె విమర్శలను తట్టుకోలేక పోతున్నారు. షర్మిల రాకతో ఓ రకంగా కాంగ్రెస్‌ మళ్లీ జవసత్వాలు నింపుకుంది. అందుకే ఎదురుదాడికిదిగుతున్నారు. ఇప్పటికే  వైఎస్‌ అనుయాయులను కూడా దూరంగా పెట్టారు. గతంలో వైఎస్‌కు ఆత్మబంధువుగా కెవిపి రామచంద్రారవు, మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ లాంటి వారిని ముందునుంచే దూరం పెట్టారు. ఈ విషయంలో ఆయన తన తండ్రి వైఎస్‌ను ఆదర్శంగా తీసుకోలేదనే చెప్పాలి. నిజానికి జగన్‌ తలచుకుంటే షర్మిలకు, భారతిలకు పదవులు ఇవ్వడం పెద్ద లెక్క కాదు. కానీ అలా చేయలేదు. కెసిఆర్‌ తన కుటుంబ సభ్యులకు, బంధువులు అందరికీ పదవులు కట్టబెట్టి కుటుంబ పాలనకు తెరతీసారు. చంద్రబాబు కూడా లోకేశ్‌ను తీసుకుని వచ్చారు. జగన్‌ అలా చేయకుండా షర్మిలను దూరం పెట్టబడం వల్ల ఆమె ఇప్పుడు పిసిసి చీఫ్‌గా జగన్‌ అక్రమాలను నిలదీస్తున్నారు.

పదవులే కావాలంటే ఇవ్వడం జగన్‌కు పెద్ద సమస్య కాదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గతంలోనే అన్నారు. అంటే షర్మిల నాయకత్వం కోరుకుంటున్నదని దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. తనకు తిరుగులేని విధంగా కొనసాగాలని జగన్‌ భావించారు. అందుకే రాజకీయాల నుంచి, అధికార పరిధి నుంచి తల్లి జయమ్మను, చెల్లి షర్మిలను దూరం చేశారని అనుకోవాలి. మరోవైపు కాంగ్రెస్‌ను పునరుత్తేజపర్చ డానికి తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. వామపక్షాలు అడ్రస్‌ లేకుండా పోయాయి. ముఖ్యమంత్రి జగన్‌ విషయంలోనే అసంతృప్తిగా వున్న కెవిపి కాంగ్రెస్‌లో వుంటూ చురుకైన రాజకీయాలకు ముందుకు వచ్చారు. ఉండవల్లి అడపాదడపా తన ఆలోచనలు బటయకు చెబుతున్నారు. దీనికితోడు ఎపిలో కుల రాజకీయాలు నడుస్తున్నాయి. రాజధాని లేదన్న భావన ప్రజల్లో బలంగానే ఉంది. ఈ క్రమంలో టిడిపి దూకుడు ప్రదర్శిస్తోంది. జనసేన మద్దతుతో  అటు టిడిపి, ఇటు బిజెపి పట్టుదలగా ఉన్నాయి. ఈ క్రమంలో రానున్న ఎన్నికల్లో వీరంతా కలసి పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. బిజెపి కూడా పాదం మోపాలన్న తపనలో ఉంది. మొత్తంగా ఎపిలో రాజకీయాలు ఎవరికి అనుకూలమో..ఎవరికి ప్రతికూలమో తెలియని గందరగోళ పరిస్థితి ఉంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments