భద్రాచలం, ఆగస్ట్ 23 (జనవిజయం): ఎటువంటి అసాంఘిక, చట్ట వ్యతిరేక పరితోష్ పంకజ్ యజమానులను ఆదేశించారు. బుధవారం భద్రాచలంలోని వివిధ లాడ్జిల యజమానులు, నిర్వాహకులతో పోలీసులు సమావేశం నిర్వహించారు. సమావేశం లో భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్ మాట్లాడుతూ ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చూడాలని అన్నారు. లాడ్జిలో జరిగే అనుమానాస్పద విషయాలు ఏమైనా గ్రహిస్తే వెంటనే పోలీసు వారికి సమాచారం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అసాంఘిక కార్యకలాపాలకు సహకరిస్తున్నట్లు పోలీసు దృష్టికి వస్తే లాడ్జి యజమానులపై కూడా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఏఎస్పీ హెచ్చరించారు. లాడ్జికి వచ్చే కస్టమర్స్ కు సంబంధించి పూర్తి వివరాలను నమోదు చేయాలని సూచించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో పోలీసువారికి సహాయ సహకారాలు అందించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో భద్రాచలం సీఐ నాగరాజు రెడ్డి, ఎస్ఐ మధు ప్రసాద్, భద్రాచలం లాడ్జిల యజమానులు పాల్గొన్నారు.