జనవిజయంఆంధ్రప్రదేశ్ఆరోగ్యశ్రీ పథకంలోకి బ్లాక్‌ ఫంగస్‌

ఆరోగ్యశ్రీ పథకంలోకి బ్లాక్‌ ఫంగస్‌

వ్యాధికి చికిత్స చేసే ఆస్పత్రులను నోటిఫై చేయండి
కోవిడ్‌ వల్ల తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలను ఆదుకోవాలి
ఈ మేరకు తగిన కార్యాచరణ రూపొందించండి
ఈ నెలాఖరు వరకు కర్ఫ్యూ పొడిగింపు
యథావిథిగా నియమావళి వర్తింపు
కోవిడ్‌పై సవిూక్షలో సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ ఆదేశం

అమరావతి,మే17(జనవిజయం): ఎ.పిలో విస్తిరస్తున్న బ్లాక్‌ఫంగస్‌పై అప్రమత్తంగా ఉండాలని సిఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. బ్లాక్‌ ఫంగస్‌ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం అందించాలని సీఎం ఆదేశించారు. బ్లాక్‌ ఫంగస్‌ను ముందుగానే గుర్తించేందుకు ప్రోటోకాల్‌ ఏర్పాటు చేసుకోవాలని నిర్దేశించారు. అదే విధంగా బ్లాక్‌ ఫంగస్‌ వ్యాధిగ్రస్తులకు వెంటనే ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందించడానికి కూడా అనుమతులను వెంటనే ఇచ్చేలా తగిన ప్రోటోకాల్‌ ఏర్పాటు చేసుకోవాలన్న సీఎం బ్లాక్‌ ఫంగస్‌ చికిత్స కోసం నోటిఫైడ్‌ ఆస్పత్రులను గుర్తించాలన్నారు. కాగా డయాబెటిక్‌, విపరీతంగా స్టెరాయిడ్స్‌ వల్ల బ్లాక్‌ ఫంగస్‌ వచ్చే అవకాశాలున్నాయని, రాష్ట్రంలో ఇప్పటి వరకు 9 బ్లాక్‌ ఫంగస్‌ కేసులను గుర్తించామని సమావేశంలో అధికారులు వివరించగా, ఆ వ్యాధిపై అప్రమత్తంగా ఉండాలని సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ ఆదేశించారు. రాష్ట్రంలో కోవిడ్‌19 నియంత్రణ, నివారణ, వ్యాక్సినేషన్‌పై క్యాంప్‌ కార్యాయంలో సీఎం వైయస్‌ జగన్‌ సవిూక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎం జగన్‌ మాట్లాడుతూ ఫీవర్‌ సర్వేలో గుర్తించిన వారికి పరీక్షలు నిర్వహించాన్నారు. పరీక్షల్లో వైరస్‌ ఉందని తేలిన వారికి తగిన వైద్య సదుపాయాలు కల్పించడంతో పాటు మందులు కూడా అందించండని అన్నారు. కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో సదుపాయాలపై దృష్టి పెట్టాలని వాటిలో అన్ని సదుపాయాలు కల్పించాలన్నారు. ఇకపోతే రాష్ట్రంలో కర్ఫ్యూను నెలాఖరు వరకూ పొడిగించాలని సీఎం ఆదేశించారు. ఫలితాలు రావాలంటే కనీసం నాలుగువారాల కర్ఫ్యూ ఉండాలని సిం అన్నారు. కర్ఫ్యూ విధించి సుమారు 10 రోజులే దాటిందన్న సీఎం, యథాతథంగా కర్ఫ్యూ సమయం, నియమావళి అమలు చేయాలన్నారు. గ్రావిూణ ప్రాంతాల్లో కేసులు పెరగకుండా చర్యలు తీసుకోవాలన్న సీఎం, వాలంటీర్లు, ఆశా వర్కర్లు, సచివాలయాల వ్యవస్థను సమర్థవంతంగా వినియోగిం చుకోవాలన్నారు. కోవిడ్‌ కారణంగా తల్లిదండ్రులు ఎవరైనా చనిపోతే వారి పిల్లలను ఆదుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఈ మేరకు తగిన కార్యాచరణ రూపొందించాలని నిర్దేశించారు. కోవిడ్‌తో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల పేరు విూద కొంత మొత్తాన్ని డిపాజిట్‌ చేసి, దానిపై వచ్చే వడ్డీ ప్రతి నెలా వారి కనీస అవసరాలు తీర్చేలా ఆలోచన చేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు.

ఇక రాష్ట్రంలో ప్రస్తుతం కోవిడ్‌ పరిస్థితి, వైద్య సదుపాయాలను సవిూక్షా సమావేశంలో అధికారులు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రసుత్తం 625 కోవిడ్‌కేర్‌ ఆస్పత్రులలో 47,825 బెడ్లు ఉన్నాయని, వాటిలో 38,492 బెడ్లు ఆక్యుపైడ్‌ కాగా, వారిలో 25,539 మంది ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందుతున్నారని సవిూక్షా సమావేశంలో అధికారులు వెల్లడించారు. కోవిడ్‌ ఆస్పత్రులలో ప్రస్తుతం 6,576 ఐసీయూ బెడ్లు. 23,463 నాన్‌ ఐసీయూ ఆక్సీజన్‌ బెడ్లు. 17,246 నాన్‌ ఐసీయూ నాన్‌ ఆక్సీజన్‌ బెడ్లు. 3,467 వెంటిలేటర్లు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఇంకా 115 కోవిడ్‌ కేర్‌ సెంటర్లలోని 52,471 బెడ్లలో 17,417 ఆక్యుపైడ్‌ అని వారు వివరించారు. రాష్ట్రానికి ప్రస్తుతం 590 మెట్రిక్‌ టన్నులు కేటాయించగా, అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రున్నింటిలో కలిపి రోజూ 590 మెట్రిక్‌ టన్నుల నుంచి 610 టన్నుల వరకు ఆక్సీజన్‌కు డిమాండ్‌ ఉందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రతి రోజూ ఒక ఆక్సీజన్‌ ఎక్స్‌ప్రెస్‌ 80 మెట్రిక్‌ టన్నుల సామర్థ్యంతో జామ్‌నగర్‌ నుంచి కేటాయించాలని కేంద్రాన్ని కోరుతున్నామని, అదే విధంగా రోజూ కనీసం 130 మెట్రిక్‌ టన్నుల ఆక్సీజన్‌ను బళ్లారి నుంచి సరఫరా చేసేలా కర్ణాటక ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామని అధికారులు చెప్పారు. రాష్ట్రానికి ఇప్పటివరకూ 8 ఐఎస్‌ఓ కంటైనర్లు రాగా, మరో రెండు కంటైనర్లు కూడా వస్తున్నాయని వారు వెల్లడించారు. కేంద్రం నుంచి మొత్తం 75,99,960 వ్యాక్సిన్‌ డోస్‌లు రాగా, వాటిలో కోవీషీల్డ్‌ 62,60,400 వ్యాక్సిన్లు కాగా, కోవాగ్జిన్‌ వ్యాక్సిన్లు 13,39,560 అని అధికారులు వ్లెడిరచారు. ఇక ఈనెల 15వ తేదీ నాటికి రాష్ట్రాని కోవీషీల్డ్‌ వ్యాక్సిన్లు 6,90,360 కేటాయించగా, అంత కంటే ఇంకా ఎక్కువగా 8,90,360 డోస్‌లు సేకరించామని వారు తెలిపారు. మరోవైపు కొవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ డోస్‌లు 2,27,490 కేటాయించగా, కేవలం 1,25,000 మాత్రమే సరఫరా చేశారని అధికారులు పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్‌ (నాని), సీఎస్‌ ఆదిత్యనాథ్‌దాస్‌, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, కోవిడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ కెఎస్‌ జవహర్‌రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌, కోవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఛైర్మన్‌ ఎంటీ కృష్ణబాబు, కుటుంబ సంక్షేమ కమిషనర్‌ కాటమనేని భాస్కర్‌, వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి (కోవిడ్‌ మేనేజ్‌మెంట్‌, వ్యాక్సినేషన్‌) ఎం.రవిచంద్ర, 104 కాల్‌ సెంటర్‌ ఇంఛార్జ్‌ ఎ.బాబు, ఆరోగ్యశ్రీ సీఈఓ డాక్టర్‌ ఎ.మల్లికార్జున్‌, ఏపీఎంఎస్‌ఐడీసీ వీసీ అండ్‌ ఎండీ వి.విజయ రామరాజు, ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్‌.గుల్జార్‌తో పాటు, పలువురు ఉన్నతాధికారులు ఈ సవిూక్షలో పాల్గొన్నారు.

ఇదిలావుంటే కర్ఫ్యూ వల్ల కేసులు తగ్గుముఖం పడుతున్నాయని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని అన్నారు. రాష్ట్రంలో ఈ నెలాఖరు వరకు కర్ఫ్యూ పొడిగించాలని సీఎం జగన్‌ ఆదేశించారన్నారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే కార్యకలాపాకు అనుమతి ఉంటుందని తెలిపారు. నిబంధనలను మరింత కఠినంగా అమలు చేయాలని సీఎం ఆదేశించారన్నారు. బ్లాక్‌ ఫంగస్‌ సోకిన వారికి ఆరోగ్య శ్రీ పరిధిలో చికిత్స చేయాలని సీఎం ఆదేశించారన్నారు. పాజిటివ్‌ పేషంట్ల గుర్తింపు కోసం ఫీవర్‌ సర్వే చేస్తున్నామని తెలిపారు. గ్రావిూణ ప్రాంతాల్లో మరింత పకడ్బంధీగా ఫీవర్‌ సర్వే నిర్వహిస్తున్నామన్నారు. సర్వేలో గుర్తించిన వారిలో అవసరమైన వారిని ఆస్పత్రుల్లో చేర్పించి చికిత్స అందిస్తామని మంత్రి ఆళ్లనాని చెప్పారు. కొవిడ్‌ కారణంగా తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలు అనాథలేతే వారిని ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి తెలిపారు. పదివేల ఆక్సిజన్‌ కాన్సన్‌ ట్రేటర్లకు టెండర్లు పిలిచినట్లు చెప్పారు. ఈనెలాఖరు కల్లా 2వేలకు పైగా ఆక్సిజన్‌ కాన్సన్‌ ట్రేటర్స్‌ రాబోతున్నాయని ప్రకటించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 9 బ్లాక్‌ ఫంగస్‌ కేసులు నమోదయ్యాయని మంత్రి తెలిపారు. బ్లాక్‌ ఫంగస్‌ కేసులను వెంటనే గుర్తించి నివారణ చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించార న్నారు. బ్లాక్‌ ఫంగస్‌ నివారణకు వాడే మందులను సమకూర్చాలని సీఎం ఆదేశించారని పేర్కొన్నారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి