జనవిజయంఆరోగ్యంఆరోగ్యానికి, డాక్టర్ కి ఉన్న సంబంధం

ఆరోగ్యానికి, డాక్టర్ కి ఉన్న సంబంధం

“ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దేన్ క్యూర్” అంటారు. అంటే రోగం వచ్చాక తగ్గించుకొనే దాని కంటే రోగం రాకుండా ముందే జాగ్రత్తగా ఉండడం మంచిదని దాని అర్థం. రోగమంటూ ఒక్కసారి వచ్చిందంటే అతుకుపడినట్లే కదా, ఎప్పటికైనా అతుకు అతుకే. రోగం రాకుండదంటే ఆరోగ్యంగా బ్రతకడమే మార్గం. ఆరోగ్యంగా బ్రతకడానికి డాక్టర్ తోగానీ, హస్పిటల్ లో కానీ పనిలేదు. జంతువులన్నీ ఆరోగ్యంగా జీవిస్తున్నాయి. అవి ఆ ఆరోగ్యాన్ని పొందడానికి ఏ వైద్యుల సహాయం, ఏ హస్పిటల్ సహాయం తీసుకుంటున్నాయి? ఈ వాస్తవం తెలియక చాలామంది ఇష్టం వచ్చినట్లు అన్నీ తినడం, త్రాగడం చేసి, ఏదన్నా రోగం వస్తే వైద్యం చేయడానికి వైద్యులున్నారు కదా, ఆరోగ్యాన్నివ్వడానికి పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి కదా అని అంటూ, ఆరోగ్యాన్ని చేతులారా పాడు – చేసుకుంటూ ఉంటారు. అసలు ఆరోగ్యానికి, డాక్టర్ కు, ఆరోగ్యానికి, హాస్పిటలకు సంబంధం ఉంటుందా? లేదా? అని ఆలోచిస్తే అసలు డాక్టర్ కి, ఆరోగ్యానికి సంబంధం లేదు. కాబట్టి, ఆరోగ్యవంతులు ఎవరూ డాక్టర్ వద్దకు, హాస్పిటల్కు వెళ్ళరు. డాక్టరుకు ఉన్న సంబంధం అలా రోగంతో మాత్రమే. రోగం ఎవరి కొస్తుంది అంటే అనారోగ్యవంతులకి కాబట్టి అనారోగ్యంతో ఉన్నవారే డాక్టర్‌ను సంప్రదిస్తారు. రోగిని బాధిస్తున్న రోగం గురించే డాక్టర్లు ఆలోచనంతా పెట్టుకుని ఆ బాధ నుండి మనల్ని రక్షిస్తున్నారు. పూర్తిగా ఆ బాధ పోయినప్పటి నుండి మళ్ళీ ఏ బాధ రానంతకాలం మనం డాక్టర్ ముఖం చూడం. ఒకసారి బాధలు వచ్చి తగ్గాక, మీరు ఇంటి వద్ద ఏమని ప్రార్థిస్తుంటారో తెలుసుగదా! ఓ దేవుడా! నేను జీవితంలో హాస్పిటల్ పాలుగాకుండా, డాక్టర్ల చుట్టూ తిరగకుండా ఆరోగ్యంగా, చల్లగా ఉండేటట్లు చూడు తండ్రి నీ కొండకు నడిచి వచ్చి మరీ గుండు కొట్టించుకుని, నీ హుండీలో లక్ష రూపాయలు (డాక్టర్లకు ఇచ్చే బదులు నీకే) వేస్తానని ప్రార్థిస్తుంటారు. నిజానికి డాక్టర్లు, హాస్పిటల్స్ ఆరోగ్యాన్నిచ్చేటట్లయితే మీరు హాస్పిటల్స్ కి, డాక్టర్ల వద్దకు వెళ్ళేట్లు చేయిదేముడా, డాక్టర్లకు లక్షలిస్తానని, ప్రార్థించడం చెయ్యాలి. రోగికి పూర్తి ఆరోగ్యం డాక్టర్ల వల్ల, హాస్పిటల్స్ వల్ల రాదని వైద్యులందరికీ తెలుసు. ఈ విషయం ప్రజలకే తెలియడం లేదు. ఆరోగ్యం అనేది డాక్టర్ల చేతిలో ఉన్నదనే అపోహలో ఉంటున్నారు. నాలుగు లక్షలు బ్యాంక్ లో డిపాజిట్ చేసుకుంటే ఆరోగ్య రక్షణకు అది సరిపోతుందను కుంటున్నారు. ఆరోగ్యమనేది ఒకరు ఇస్తే వచ్చేది కాదు, మనం పుచ్చుకునేది కాదు, డబ్బులు పోసి కొనుక్కునేది అంతకంటే కాదు. అలా వైద్యులు ఆరోగ్యాన్నిచ్చేవారైతే, మనకు ఇవ్వకపోతే ఇవ్వకపోయారు, కనీసం డాక్టరు అని నమ్ముకొని ఆయన్ని పెళ్ళి చేసుకున్నందుకు వాళ్ళ ఆవిడకు ఆరోగ్యం ఇవ్వగలుగుతున్నారా? వాళ్ళకు పుట్టిన పిల్లలకన్నా పూర్తిగా ఇవ్వగలుగుతున్నారా? లేదా కని, పెంచి వైద్యుడు కావడానికి కారకులైన వాళ్ళ తల్లిదండ్రులకైనా అందించగలుగుచున్నారా? లేదే! అందాకా ఎందుకు, వాళ్ళ స్వంతానికైనా పూర్తి ఆరోగ్యాన్ని ఆ మందులు, హాస్పిటల్, వైద్యశాస్త్రం వల్ల అందించుకోగలుగు తున్నారా? అదీ లేదే! చివరకు వాళ్ళకి బి.పి.లు, సుగలు, కీళ్ళ నొప్పులు, గుండెజబ్బులు వస్తూనే ఉన్నాయి కదా! పైగా, సుగర్ స్పెషలిస్టుగా పనిచేస్తూ ఎన్నో వేలమందికి సుగరు రోగానికి ఉపశమనాన్ని కలిగించే సుగరు డాక్టర్ గారి కన్నా సుగరు జబ్బు రాకుండా ఏమన్నా ఉంటున్నదా అంటే, శుభ్రంగా వచ్చే స్తున్నది. మరి వారికే వారి కుటుంబాలకే ఆరోగ్యం గ్యారెంటీ లేనప్పుడు మరి మీకెవరిస్తారు? అందుచేత ఆరోగ్యం అనేది డాక్టర్లు ఇచ్చేది కాదు. వారు ఇచ్చేది రోగాల నుండి ఉపశమనము లేదా విముక్తి మాత్రమే. ఆరోగ్యం ఇంకొకరు ఇచ్చేది కాదని ఇప్పటికైనా తెలిసిందికదా! మరి మన ఆరోగ్యం ఎవరిచేతుల్లో ఉందో తెలుసుకుందాము.

రచయిత: డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు

రేపు వైద్య విధానాల వల్ల మేలు అనే అంశం గురించి తెలుసుకుందాం….

మీ ఆరోగ్యం-మీ చేతుల్లో వ్యాసాలలో ఇంతక్రితం వ్యాసం డాక్టర్ ఇచ్చేదేమిటి? కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మంతెన ఆరోగ్య సలహాలు అన్నీ చూడాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి