జనవిజయంఆరోగ్యంఆరోగ్యం ఎలా వస్తుంది?

ఆరోగ్యం ఎలా వస్తుంది?

కండిషన్ గా ఉన్న కారు నడవాలంటే, ప్రతి రోజూ దానికి కొన్ని అవసరాలుంటాయి. అవి, కొంత నీరు కావాలి. కొంత ఆయిల్ కావాలి. కొంత ఇంజన్ ఆయిల్ కావాలి, కొంత గాలి కావాలి మొదలగునవి. ఇలాంటి అవసరాలన్నింటినీ తీరిస్తే ఆ కారు సవ్యంగా నడువగలదు. ప్రతి రోజూ ఆ కారుకు ఇవి కనీస అవసరాలు. వాటిని అందించకుండా నడువు అంటే, ఆ కారు ముందుకు నడవదు. అలాగే మన శరీరమనే వాహనం ప్రతి రోజూ నడవాలంటే కొన్ని అవసరాలున్నాయి. మనం వాటిని అందిస్తే వాటిని తీసుకొని, శరీరము కూడా చక్కగా తన పని తాను చేసుకుంటుంది. శరీరము దాని అవసరాలను కోరడం దాని ధర్మం. వాటిని తీర్చడము మన ధర్మం. శరీరానికి అన్నింటికంటే ముందు అవసరమైనది. ప్రాణవాయువు. అందరమూ, అప్రయత్నంగా నడిచే శ్వాసక్రియ ద్వారా, నిరంతరము శరీరానికి ప్రాణ వాయువును అందిస్తున్నాము. కాబట్టి ఇబ్బంది లేదు. మన చెప్పు చేతల్లో ఉన్న శరీర అవసరాలు లేదా ధర్మాలు చూస్తే, అవి 1) నీటి ధర్మం 2) ఆహార ధర్మం 3) వ్యాయామ ధర్మం 4) విశ్రాంతి ధర్మం 5) విసర్జక ధర్మం మొదలగునవి.

ఈ ఐదు ధర్మాలను మనం ప్రతిరోజూ ఆచరిస్తే మన శరీర అవసరాలు తీరుతాయి. మరి మనం ప్రతి రోజూ ఈ శరీర అవసరాలను పూర్తిగా తీరుస్తున్నామా? నీరు త్రాగితే మూత్రం వస్తుందని సరిగా త్రాగం. ఒకవేళ త్రాగినా నీళ్ళ బదులుగా కూల్ డ్రింక్, బీరు, మజ్జిగ ఇలాంటివి త్రాగి, అందులో నీరుందిగా దాన్ని సరిపెట్టుకో అంటాము. ఆహారం తింటాము కానీ నాలుకకు పనికి వచ్చేదే తప్ప శరీరానికి పనికొచ్చే, అవసరమయ్యే ఆహారం తినము. రోజూ మూడు పూట్ల డొక్క ఆడిస్తాము కాని రెక్కలు ఆడించడానికి అంటూ, తిరుగుతూ 24 గంటలు పొట్టకు, శరీరానికి పని పెట్టేస్తున్నాము. ఏ రోజుకారోజు శుభ్రం చేసుకోనివ్వము, రోగాలు వచ్చినప్పుడు కూడా చేసుకోనివ్వకుండా, లంఖణాలు చెయ్యకుండా చెడును అణచివేస్తుంటాము.

ఈ ఐదు ధర్మాలను ప్రతిరోజూ ఉల్లంఘించడం వల్ల ఈ శరీరానికి అనేక సమస్యలు వస్తున్నాయి. మనం చేసే ఈ అధర్మపు పనుల వల్ల మనలో ఉన్న ఆరోగ్యమనే వెలుతురు తగ్గిపోతున్నది. దానితో రోగాల చీకటి మెల్లగా మనలో పెరగడం ప్రారంభిస్తున్నది. మళ్ళీ మనలో ఆరోగ్యపు వెలుగు వెలగాలంటే శరీరానికి కావలసిందల్లా దాని అవసరాలు మాత్రమే. దానికి కావలసిన వాటిని మనం అందిస్తే, తన డ్యూటీ తను చేసుకుని ఆరోగ్యాన్ని శరీరమే సంరక్షించుకుంటుంది. కారుకి ప్రతి రోజూ అవసరాలను తీరిస్తే నడుస్తుంది. కానీ రిపేరు వచ్చినప్పుడు షెడ్డుకి తీసుకొని వెళ్ళి మళ్ళీ మనుషులే రిపేరు చేయాలి. ఈ శరీరానికి అలాంటి ఇబ్బంది లేదు. ఇది ఆటోమ్యాటిక్ మెకానిజమ్ ఉన్న గొప్ప శరీరం. రోజూ అవసరాలు తీరిస్తే నడవడమే ఈ శరీరం గొప్పదనము కాదు, ఏదన్నా ఇబ్బంది వస్తే ఎక్కడికీ వెళ్ళకుండా తనే సొంతంగా రిపేరు చేసుకుని, హాయిగా మళ్ళీ నడవగలదు.

ఈ సౌకర్యాలన్నీ పని చెయ్యాలంటే దానికి కావలసిన కనీస ధర్మాలను మనం ఆచరించి అందిస్తే, చాలు. దాని ధర్మాన్ని అది నెరవేర్చి ఆరోగ్యాన్ని అందిస్తుంది. ధర్మో రక్షతి రక్షితః, మనం ధర్మాన్ని ఆచరిస్తే మనల్ని ఆ ధర్మం కాపాడుతుంది. మన ఆరోగ్యం ఈ ధర్మం ప్రకారం వస్తుంది. ఆరోగ్యం కావాలా? ధర్మాచరణ, అనారోగ్యం కావాలా? అధర్మాచరణ. మనం ఏది కావాలనుకుంటే అదే వస్తుంది. ఆరోగ్యానికి ఈ ఒక్కటే సహజమైన మార్గము. అందరికీ సులువైన మార్గము. ఈ శరీర ధర్మాలను అందరూ ఆచరించేటట్లు ఈ మీ ఆరోగ్యం మీ చేతుల్లో వ్యాసాలు రూపొందించడం జరిగింది. శరీర ధర్మాల ఆచరణ ద్వారా మనకు ఆరోగ్యం లభిస్తుంది కాబట్టి, ప్రతిరోజూ నియమానుసారంగా మనం చెప్పుకుంటున్నట్లు దినచర్యను గ్రపారంభించండి. మన శరీరం దానంతటదే మెల్లగా ఆరోగ్యపు వెలుగును ప్రసాదిస్తుంది. అందరూ ఈ వెలుగుతో రోగాల చీకటిని తరిమికొట్టుకోగలరని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను.

రచయిత: డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు

తదుపరి ఆరోగ్యంపై మనస్సు ప్రభావం అనే అంశం గురించి తెలుసుకుందాం….

మీ ఆరోగ్యం-మీ చేతుల్లో వ్యాసాలలో ఇంతక్రితం వ్యాసం ఆరోగ్యం ఎవరి చేతుల్లో ఉంది కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మంతెన ఆరోగ్య సలహాలు అన్నీ చూడాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి

——-

 

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి