జనవిజయంఆరోగ్యంఆరోగ్యం అంటే?

ఆరోగ్యం అంటే?

జనవిజయం పాఠకులకు ఈ రోజు నుండి రెగ్యులర్ గా ప్రతిరోజూ మీ ఆరోగ్యం – మీ చేతుల్లో అనే సబ్జెక్టులో ప్రముఖ ప్రకృతి వైద్యులు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారి ఆరోగ్య వ్యాసాలు అందించబడతాయి.

– పల్లా కొండలరావు, ఎడిటర్, జనవిజయం డిజిటల్ ఎడిషన్

————————————————-

1.ఆరోగ్యం అంటే?

రోగం లేకుండా ఉండడాన్నే ఆరోగ్యం అని అనుకుంటున్నాము. కాని అది వాస్తవం కాదు. ఏ రోగం ఇప్పుడు లేకపోయినా, వైద్య పరీక్షలలో దొరకకపోయినా ఇంకొక 4,5 నెలలు పోయిన తరువాత మరలా పరీక్షిస్తే ఏదో ఒక రోగం బయటపడుతున్నది. అంటే లోపల పుట్టిన రోగం పరీక్షలకు దొరికే స్థితికి వచ్చిందని అర్థం చేసుకోవచ్చు. ఇంకా కొన్ని రోజులలో అది పూర్తి రోగం రూపంలో బయటపడుతుంది. రోగం రూపంలో బయటకు రాకపోయినా వచ్చే గుణం లోపల ఉంటే దానిని ఆరోగ్యం అని అనవచ్చా? రోగం పునాదుల్లో ఉన్నా దానిని ఆరోగ్యం అని అనకూడదు. ప్రస్తుతం ఏ రోగం లేకుండా ఉండి దానితోపాటు మనలో ఏ రోగం రాకుండా ఉండే స్థితి కూడా ఉంటే దానిని ఆరోగ్యం అని అనుకోవచ్చు. శరీరంలో ప్రతి కణము, ప్రతి అవయవం అది ఎంత వరకూ పనిచేయగలదో అంత శక్తివంతంగా పని చేస్తూ మిగతా అవయవాలతో సహకరిస్తూ శరీరాన్ని సుఖంగా ఉండేలా నడిపిస్తే ఆ శరీరం ఆరోగ్యంగా ఉన్నట్లు.

శరీరం ఆరోగ్యంగా ఉన్నదని చెప్పడానికి బాహ్యంగా కొన్ని లక్షణాల ద్వారా మనం అంచనా వేసుకోవచ్చు. అవి ఏమిటంటే : పరిశుభ్రంగా, కాంతిగా ఉండే చర్మం, మెరిసే కళ్ళు (కాంతవంతముగా), ఎముకలను కప్పి ఉంచిన బలమైన కండరాలు, తియ్యటి శ్వాస, మంచి ఆకలి, ప్రశాంతమైన నిద్ర, మల మూత్రాదులు ఏరోజుకారోజు బయటకు వెళ్ళిపోవడం, నోరు, పాచి, లాలాజలం, మలం, మూత్రం, చెమట మొదలగునవి పూర్తిగా వాసన రాకుండా ఉండడం, కాళ్ళు, చేతులు మొదలైన అవయవాలు ఇబ్బంది లేకుండా కదలడం మొదలగునవి. ఇలా ఉంటే శరీరం ఆరోగ్యముగా ఉన్నదని అర్థము.

ఒక్క శారీరక ఆరోగ్యము మాత్రమే సరిపోతుందా? మనిషికి తప్ప మిగతా జీవులన్నింటికీ అది సరిపోతుంది. ఆ జీవులకు ఒక్క శరీరము ఆరోగ్యముగా ఉంటే జీవితము హాయిగా గడిచిపోతుంది. మనిషికి మనసంటూ ఒకటి ఉంది కాబట్టి దాని ఆరోగ్యం కూడా శరీర ఆరోగ్యంతోపాటు అవసరమౌతుంది. ఆరోగ్యవంతమైన శరీరంతోపాటు, ఆరోగ్యవంతమైన మనసు ఉంటే ఆ వ్యక్తి పూర్తిగా – ఆరోగ్యంగా ఉన్నట్లని చెప్పవచ్చు. శరీర ఆరోగ్యాన్ని లెక్కలు వేయడానికి పరికరాలు ఉన్నాయి కాని మానసికమైన ఆరోగ్యాన్ని తెలియజేయడానికి ఎలాంటి పరికరాలు కనిపెట్టలేదు. ఒక వ్యక్తి మానసికంగా ఆరోగ్యంగా ఉన్నాడు అనడానికి కొన్ని లక్షణాలను వైద్యశాస్త్రపరంగా ప్రామాణికంగా తీసుకుంటారు. అవి ముఖ్యంగా మానసికంగా ఎలాంటి సంఘర్షణ లేకపోవడం, పరిస్థితులకు సర్దుకుని పోయే తత్త్వం కలిగి ఉండడం, ఆత్మనిగ్రహం కలిగి ఉండడం, ప్రతి చిన్నదానికి క్రుంగిపోకుండా ఉండడం, స్వంత తెలివితేటలతో ఆలోచించి నిర్ణయం తీసుకోవడం, సమస్యలను ఎదుర్కొనే శక్తిని కలిగి ఉండడం మొదలగునవి ముఖ్యంగా చెప్పుకోవచ్చు.

ఈ రెండింట్లో ఆరోగ్యం గురించి చెప్పుకునేటప్పుడు మనం శరీరం గురించే ముఖ్యంగా చెప్పుకోవడం జరుగుతుంది. ఎందుకంటే శరీరము ఎక్కువగా రోగాలపాలు అవుతూ ఉంటుంది. కాబట్టి అలాగే మనసుకీ, శరీరానికి అవినావభావ సంబంధముంది. మనసు ఆరోగ్యంగా లేకపోతే దాని ప్రభావం శరీరంపై తప్పని సరిగా పడుతుంది. శరీరము ఆరోగ్యముగా ఉంటేనే మనసు కూడా ప్రశాంతముగా ఉంటుంది. అందుచేత ముందు శరీరాన్ని బాగుచేసుకునే ప్రయత్నం చేసి తర్వాత మిగతావాటి సంగతి చూడాలి. శారీరక ఆరోగ్యాన్ని కాపాడడంలో డాక్టరు పాత్ర ఎంత? వైద్య విధానాల పాత్ర ఎంత? అసలు ఆరోగ్యం ఏమి చేస్తే వస్తుంది? ఇలాంటి విషయాలను ముందుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనసు యొక్క ప్రభావం శరీరంపై ఎలా ఉంటుందనేది 8వ అద్యాయంలో తెలుసుకుందాం.

రచయిత: డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు

రేపు డాక్టర్ అంటే? అనే అంశం గురించి తెలుసుకుందాం..

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంవ్యవసాయంప్రముఖులువీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యజర్నలిజంఎడిటర్ వాయిస్వికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంన్యాయంసమాజంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీసాంకేతికతప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి