Thursday, October 5, 2023
Homeవార్తలుఅర్హులకు ప్రభుత్వ పథకాలు అందేలా సత్వర చర్యలు తీసుకోవాలి - జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్

అర్హులకు ప్రభుత్వ పథకాలు అందేలా సత్వర చర్యలు తీసుకోవాలి – జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్

ఖమ్మం, ఆగస్టు 18(జనవిజయం): అర్హులకు ప్రభుత్వ పథకాలు అందేలా సత్వర చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులతో కలిసి తెలంగాణకు హరితహారం, గృహలక్ష్మి , ఇంటి పట్టాల పంపిణీ, జీఓ 59, నోటరి భూముల క్రమబద్ధీకరణ, బీసి, మైనారిటీ లకు లక్ష ఆర్థిక సహాయం, గొర్రెల పంపిణీ, కారుణ్య నియామకాలు వంటి పలు అంశాల పై జిల్లా కలెక్టర్ లతో వీడియో సమావేశం నిర్వహించి సమీక్షించారు.

ఈ వీడియో సమావేశంలో జిల్లా కలెక్టర్ నూతన కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, స్వాతంత్ర్య దినోత్సవ వజ్రోత్సవ వేడుకల ముగింపు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 26న కోటి
మొక్కలు నాటేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని, మన జిల్లాకు కేటాయించిన లక్ష్యం ప్రకారం మొక్కలు నాటేందుకు స్థలాలు గుర్తింపు, గుంతల తవ్వకం చేపట్టినట్లు తెలిపారు. జిల్లాలో సంపద వనాల లక్ష్యాలు, తెలంగాణకు హరితహారం లక్ష్యాలను ఆగస్టు 26 నాటికి పూర్తి చేసేలా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రతివారం జిల్లాలో గొర్రెల యూనిట్లు గ్రౌండింగ్ జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, గొర్రెల కొనుగోలు, లబ్ధిదారులకు పంపిణీ, గొర్రెలకు బీమా సౌకర్యం కల్పన, తదితర అంశాలు పకడ్బందీగా చేస్తామని కలెక్టర్ తెలిపారు. బీసి కులవృత్తుల ఆర్థిక సహాయం సంబంధించి వివరాలు ఆన్ లైన్ లో నమోదులు చేస్తామని ఆయన అన్నారు. మైనారిటీలకు ఆర్థిక సహాయం సంబంధించి జిల్లాకు కేటాయించిన లక్ష్యం ప్రకారం లబ్ధిదారుల ఎంపిక చేసి సహాయం అందిస్తామన్నారు. ఇప్పటి వరకు 32 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శుల రెగ్యులరైజేషన్ చేసినట్లు, మిగిలిన వారి ప్రక్రియ సంబంధించి జిల్లా కమిటి స్క్రూటినీ పూర్తి చేసి జూనియర్ పంచాయతీ కార్యదర్శుల రెగ్యులరైజేషన్ పత్రాలు పంపిణీ త్వరగా పూర్తి చేయనున్నట్లు ఆయన అన్నారు. గృహలక్ష్మి పథకం క్రింద వచ్చిన దరఖాస్తుల క్షేత్రస్థాయి ధృవీకరణ నిర్దేశిత సమయంలో పూర్తి చేసి, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అర్హూలను ఎంపిక చేసి లబ్దిదారుల జాబితా తయారుచేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. 1108 సోషల్ వెల్ఫేర్ పరిధిలో ఇంటి పట్టాల పంపిణీ చేసినట్లు, మిగులు పట్టాల పంపిణీ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేస్తామని ఆయన అన్నారు. ప్రభుత్వ ఉత్తర్వు 59 కింద పెండింగ్ రుసుము వసూలు ప్రణాళికాబద్ధంగా చేపట్టనున్నట్లు, రెండవ దశ జీఓ 59 కింద దరఖాస్తుల ధృవీకరణ పై శ్రద్ద వహించి వారం రోజులలో ధృవీకరణ పూర్తి చేయనున్నట్లు అన్నారు.

ఈ వీడియో సమావేశంలో అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్, జిల్లా అటవీ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్, జెడ్పీ సిఈఓ అప్పారావు, జిల్లా పశు సంవర్థక అధికారి వేణు మనోహర్, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి ఎం.ఏ. మహమూది, జిల్లా బీసి అభివృద్ధి అధికారిణి జి. జ్యోతి, జిల్లా సాంఘీక సంక్షేమ అధికారి కె. సత్యనారాయణ, కలెక్టరెట్ ఏవో అరుణ, సూపరింటెండెంట్లు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments