Saturday, February 24, 2024
Homeరాజకీయంఆర్థిక సంక్షోభంలో ధృడ నిర్ణయాలు

ఆర్థిక సంక్షోభంలో ధృడ నిర్ణయాలు

  • నేటి సంక్షోభాన్ని మించి ఎదుర్కొన్న పివి
  • దేశానికి మహర్దశ పట్టించిన మహానుభావుడు

న్యూఢల్లీ,ఫిబ్రవరి9(జనవిజయం):

ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటికి దేశాన్ని కుదిపి వేస్తున్న ఆర్థిక సంక్షోభాన్ని చాకచక్యంగా పరిష్కరించి, దేశానికి బంగారు బాట వేసిన ధీశాలి పివి నరసింహారావు. దేశానికి అవసరమైన ఆర్థిక,రాజకీయ సంస్కరణ లతో ముందుకు సాగిన రాజనీతిజ్ఞుడు పీవీ. ఆయన పాలనా ఫలితాలు, ఫలాలు నేటికీమనమంతా అనుభవి స్తూనే ఉన్నాం. వాటి నుండి పాఠాలు నేర్చుకోవడంలో మాత్రం వెనకబడి ఉన్నాం. భారత రాజకీయాలకు కొత్త అర్థాలు చెప్పి..దేశం కోసం పనిచేయడమే కర్తవ్యంగా భావించిన సదా స్మరనీయుడు మన పివి. భారత రాజకీయ, ఆర్థిక, సామాజిక వ్యవస్థ సుస్థిరతకు ఆయన అందించిన విలువైన నాయకత్వం సదా స్మరణీ యం. యావత్‌ ప్రపంచం కరోనా సంక్షోభం ఎదుర్కొంటున్న ప్రస్తుత పరీక్షా కాలంలో సామాన్య మానవుడి మనుగడే ప్రశ్నార్థక మవుతున్నది.  కరోనా సంక్షోభ సమయంలో, ఆర్థిక వ్యవస్థ గాడి తప్పుతున్న నేపథ్యంలో, ప్రతి ఒక్కరికీ పీవీ ఆర్థిక సంస్కరణలే గుర్తుకు వస్తాయి. ఆర్థికవేత్త మన్మోహన్‌సింగ్‌ను తీసుకుని వచ్చి ఆయన ద్వారా తన ఆలోచనలను అమలు చేయించి దేశానికి దిశను చూపారు. అదే మన్మోహన్‌ పదేళ్ల కాలం దేశాన్ని ఏలినా అంతటి ప్రతిభ కనబర్చలేక పోయారు. కేవలం పివిని విస్మరించడం వల్ల వచ్చిన విమర్శలను తట్టుకు నేందుకు మాత్రమే సోనియా మన్మోహన్‌ను తెరపైకి తెచ్చి తన కుటిల రాజకీయాలను నడిపారనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. రాజనీతిజ్ఞత, ఆర్థిక సంస్కరణాభిలాష అన్నవి ప్రతిభ ఉండి అమలు చేయగల ధైర్యం ఉన్న నేతకు మాత్రమే సొంతం. అందుకే పీవీని స్మరించుకోవటం మన కర్తవ్యమే కాకుండా బాధ్యత కూడా.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments