భీమా చేయండి ధీమాగా వుండండి- ఎఫ్.ఎల్.సి మోహన్ రావు
వేంసూరు,ఆగస్ట్,11(జనవిజయం): మండల పరిధిలోని రామన్నపాలెం గ్రామ పంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో బీరపల్లి ఏపీజీవీబీ బ్రాంచ్ తమ ఖాతాదారులకు శుక్రవారం కల్పించిన అవగాహన సదస్సులో పాల్గొన్న మేనేజర్ కళ్యాణం మాధవి మాట్లాడుతూ పల్లె ప్రజల ఆర్థిక ప్రగతి సాధనే ఏపి.జి.వి.బి. బ్యాంక్ లక్ష్యం అని అన్నారు. వ్యవసాయ రుణాలు సకాలంలో చెల్లించి అధిక వడ్డీల భారీ నుండి ఉపశమనం పొందాలని మాధవి సూచించారు. అనంతరం రీజియన్ కార్యాలయ ఆర్థిక వ్యవహారాల సలహాదారు(ఎఫ్ ఎల్ సి) డి.మోహన్ రావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగత బీమాలు చేయించుకొని ధీమాగా కుటుంబానికి అండగా ఉండాలని, బ్యాంకులో ఉన్నటువంటి పలు రకాల ఇన్సూరెన్స్ లను మరియు డిపాజిట్ లను వాటి యొక్క వడ్డీ రేట్లు బ్యాంక్ ఖాతాదారులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్ రమాకాంత్,క్యాషియర్ కృష్ణకాంత్, బ్యాంక్ క్లర్క్ సిహెచ్ వెంకటేశ్వరరావు, సి.డి.సి. చైర్మన్ పుచ్చ కాయల శంకర్ రెడ్డి, యాదవ సంఘం నేత నూనె హరిబాబు, వి.ఓ . ఏ లక్ష్మీనారాయణ, రామన్నపాలెం గ్రామ ఏపీజీవీబీ ఖాతాదారులు రైతులు తదితరులు పాల్గొన్నారు.