అర్ధమేంటి?

పొద్దుపొద్దున్నే
మబ్బుల్ని తొక్కేయాలని
సూర్యుడు ఎర్రబారుతున్నాడు

నీవెంత నిప్పులు గక్కినా
నా చల్లదనం ముందు బలాదూర్
అంటూ వేగంగా కదులుతోంది మేఘం ..

రెండూ చూస్తూ నాతో నేనే
పందెం కట్టుకున్నాను

పోరాటంలో ఒక్కరిదే విజయం
ఇప్పుడది ఎవరి పక్కనుందో
చూడాలన్నదే నా అభిమతం

బాగా ఎండ కాస్తుండడంతో
సూర్యుడిదే గెలుపనుకున్నాను..
అంతలోనే మేఘం అడ్డొచ్చింది
కాస్త చల్లదనాన్ని కిందికి పంపింది..

రెండూ నాతో దోబూచులాడుతుంటే
ముక్కుపైకి కోపం చేరింది
ఎవరు గెలుస్తారో తేల్చుకోండి
అంటూ రెండింటికీ
గట్టిగానే సైగ చేశాను..

కాసేపు కళ్ళు మూసుకుని
తెరిచేసరికి యథారూపమే..
చిరాకొచ్చేసింది…అప్పుడే
అటుగా వెళ్తున్న వ్యక్తినడిగాను

విజేతనైతే చెప్పలేను..
వారిద్దరూ లేకుంటే
నేను గెలవలేను..
చకచకా చెప్పేసి వెళ్ళిపోయాడు..

ఇదేంటి..నేను ఆడిగిందొకటి
ఆయన చెప్పిందొకటి..
ఈయనొట్టి అమాయకుడే..
ఎవరీయన…?
ఆలోచిస్తూ ఇంటి దారి పట్టాను..

ఫక్కున నవ్వాయి
అక్కుడున్న గాలి..
ఎదురుగా ఉన్న భూమి..

ఏమైంది వీటికనుకుంటూ
నడక వేగం పెంచాను..
కాసేపయ్యకైనా
తెలియకపోతుందా అని…

– నామా పురుషోత్తం
98666 45218

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి