Thursday, October 5, 2023
Homeవార్తలుగోదావరి వరద పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

గోదావరి వరద పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

గోదావరి వరద పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

  • ఎ ఎస్పీ పంకజ్ సంతోష్

భద్రాచలం, జూలై 26 (జనవిజయం):

గోదావరి వరద పెరుగుతున్న దృష్ట్యా లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తం గా ఉండాలని భద్రాచలం ఎ ఎస్పీ పంకజ్ సంతోష్ ఒక ప్రకటన లో విజ్ఞప్తి చేసేరు. పోలీసు సిబ్బంది అన్ని వేళలా ప్రజలకు అందుబాటులో ఉంటారని ఆయన తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు పోలీస్ కి సహకరించాలని ఆయన కోరారు. వరద తీవ్రత పెరిగితే సమీపం లోని పునరావాస కేంద్రాలకు వెళ్లవలసిందిగా ఆయన సూచించారు. గోదావరికి వరద క్రమేపీ పెరుగుచున్నందున, ప్రజలు సందర్శనార్దం కరకట్ట వైపు వెళ్ళటం ప్రమాదకరమని అన్నారు. భద్రాచలం లోని కరకట్ట, రెడ్డి సత్రం వైపు వెళ్లవద్దని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాబోయే 24 గంటలలో భద్రాచలం డివిజన్ పరిసర ప్రాంతాలలో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నదని అన్నారు. ఈ దృష్ట్యా జాలరులు, చేపల వేట కు వెళ్లవద్దని అన్నారు. నిండు గా ప్రవహిస్తున్న వాగులు, చెరువులలోకి కూడా చేపల వేటకు వెళ్లవద్దని ఆయన కోరారు. లో లెవల్ చప్టా ల వద్ద వరద ఉదృతి ఎక్కువగా ఉంటే దాటుటకు ప్రయత్నం చేయవద్దని తెలిపారు. ప్రజలు ఏదైనా సహాయం కోసం డయల్- 100 కు ఫోన్ చేసి పోలీస్ సేవలను వినియోగించుకోవాలని ఆయన కోరార

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments