జనవిజయంఆంధ్రప్రదేశ్ఏపీలో తొలిసారిగా జెండర్ బడ్జెట్

ఏపీలో తొలిసారిగా జెండర్ బడ్జెట్

 • వ్యవసాయం,సంక్షేమానికి పెద్దపీట
 • విద్య,వైద్య రంగాలకు పెరిగిన కేటాయింపులు
 • మహిళలు,చిన్నారులకు బడ్జెట్‌లో ప్రాధాన్యం
 • 2021-22 బడ్జెట్‌ అంచనా రూ.2,29,779 కోట్లు
 • రెవెన్యూ వ్యయం లక్షా 82 వేల 196 కోట్లు
 • మూలధన వ్యయం 47,582 కోట్లు
 • రెవెన్యూ లోటు 5 వేల కోట్లు
 • ద్రవ్యలోటు 37,029.79 కోట్లు
 • బీసీ సబ్ ప్లాన్‌కి 28,237 కోట్లు
 • కాపు సంక్షేమానికి 3,306 కోట్లు
 • ఈబీసీ సంక్షేమానికి 5,478 కోట్లు
 • బ్రాహ్మణ సంక్షేమానికి 359 కోట్లు
 • ఎస్సీ సబ్‌ప్లాన్‌కు 17,403 కోట్లు
 • ఎస్టీ సబ్‌ ప్లాన్‌కు 6,131 కోట్లు
 • మైనార్టీ యాక్షన్‌ ప్లాన్‌కు 1,756 కోట్లు
 • చిన్నారుల కోసం 16,748 కోట్లు
 • అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశ పెట్టిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి

అమరావతి,మే 20(జనవిజయం): ఏపీ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి 2021-22 బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. వరుసగా మూడోసారి బడ్జెట్‌ను ఆయన ప్రవేశపెట్టారు. దీనికి ముందు బుగ్గన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు ముందు జరిగిన కేబినెట్‌ భేటీలో బడ్జెట్‌కు కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. శాసన మండలిలో హోంమంత్రి మేకతోటి సుచరిత బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. తొలిసారి జెండర్‌ బేస్డ్‌ బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మహిళలు, చిన్నారులకు బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రాధాన్యత కల్పించింది. రూ.47,283 కోట్లతో జెండర్‌ బడ్జెట్‌ను తెచ్చింది. బడ్జెట్‌లో సంక్షేమానికి పెద్దపీట వేసింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది అత్యధిక కేటాయింపులు చేసింది. అసెంబ్లీ సమావేశంలో గురువారం ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. రైతుల కోసం ప్రత్యేకంగా కొన్నేళ్లుగా రాష్ట్రప్రభుత్వం బడ్జెట్‌ ప్రవేశపెడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే కోవలో చిన్నారులకు, మహిళలకు కూడా ప్రత్యేక బడ్జెట్‌ పేపర్‌ పెట్టాలని నిర్ణయించారు. అయితే దీనివల్ల కేటాయింపులు పెరగక పోయినా వివిధ పథకాల ద్వారా మహిళలు, చిన్నారులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంత మేర లబ్ది పొందుతున్నారో స్థూలంగా చెబుతారు. కేంద్ర ప్రభుత్వం పదిహేనేళ్ల నుంచి ఈ విధానం పాటిస్తోంది. ఇకపోతే 2021-22 బడ్జెట్‌ అంచనా రూ.2,29,779 కోట్లుగా ఆర్థికమంత్రి ప్రతిపాదించారు. గత బడ్జెట్‌ అంచనా రూ.2,24,789 కోట్లు కాగా, వెనుకబడిన కులాలకు బడ్జెట్‌లో 32శాతం అధిక కేటాయింపులు చేశారు. బీసీ సబ్‌ ప్లాన్‌కు రూ.28,237 కోట్లు, కాపు సంక్షేమానికి రూ.3,306 కోట్లు, బ్రాహ్మణు సంక్షేమానికి రూ.359 కోట్లు, ఎస్సీ సబ్‌ ప్లాన్‌కు రూ.17,403 కోట్లు, ఎస్టీ సబ్‌ ప్లాన్‌కు రూ.6,131 కోట్లు కేటాయించారు. మైనార్టీ యాక్షన్‌ ప్లాన్‌ కింద రూ.3,840 కోట్లు, మైనార్టీ సబ్‌ ప్లాన్‌కు రూ.1,756 కోట్లు, పిల్లల కోసం రూ.16,748 కోట్లు, మహిళాభివృద్ధికి రూ.47,283 కోట్లు కేటాయించారు. వ్యవసాయ పథకాలకు రూ.11,210 కోట్లు, విద్యా పథకాలకు రూ.24,624 కోట్లు కేటాయింపు చేశారు. వైద్యం, ఆరోగ్యానికి రూ.13,830 కోట్లు, వైఎస్సార్‌ పెన్షన్‌ కానుకకు రూ.17 వేల కోట్లు ఇచ్చారు. జగనన్న వసతి దీవెనకు రూ.2,223.15 కోట్లు, వైఎస్సార్‌ పీఎం ఫసల్‌ బీమా యోజనకు రూ.1,802 కోట్లు, రైతులకు సున్నా వడ్డీ కింద చెల్లింపు కోసం రూ.500 కోట్లు, డ్వాక్రా సంఘాలకు వైఎస్సార్‌ సున్నా వడ్డీ కింద చెల్లింపుకు రూ.1,112 కోట్లు కేటాయించారు. కాపు నేస్తం కోసం రూ. 500 కోట్లు, ఈబీసీ నేస్తం కోసం రూ. 500 కోట్లు, వైఎస్సార్‌ జగనన్న చేదోడు పథకం కోసం రూ.300 కోట్లు,వైఎస్సార్‌ వాహన మిత్ర పథకం కోసం రూ. 285 కోట్లు, వైఎస్సార్‌ నేతన్న నేస్తం కోసం రూ.190 కోట్లు, వైఎస్సార్‌ మత్స్యకార భరోసా కోసం రూ.120 కోట్లు, మత్స్యకారులకు డీజిల్‌ సబ్సిడీ కోసం రూ.50 కోట్లుఅగ్రిగోల్డ్‌ బాధితులకు చెల్లింపు కోసం రూ.200 కోట్లు కేటాయించడం విశేషం. రైతులకు ఎక్స్‌గ్రేషియా కింద రూ.20 కోట్లు, లా నేస్తం కోసం రూ.16.64 కోట్లు, వైఎస్సార్‌ ఆసరా కోసం రూ.6,337 కోట్లు, అమ్మ ఒడి కోసం రూ.6,107 కోట్లు, వైఎస్సార్‌ చేయూత కోసం రూ.4,455 కోట్లు,రైతు పథకాలకు రూ.11,210.80 కోట్లు, వైఎస్సార్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌కు రూ.88.57 కోట్లు, వైఎస్సార్‌ ఉచిత పంట బీమా పథకానికి రూ.1802.82 కోట్లు, వ్యవసాయ రంగంలో యాంత్రీకరణకు రూ.739.46 కోట్లు, వైఎస్సార్‌ పశువు నష్టపరిహార పథకానికి రూ.50 కోట్లు, విద్యారంగానికి రూ. 24,624.22 కోట్లు, దీంట్లో స్కూళ్లలో నాడు-నేడుకు రూ.3,500 కోట్లు కేటాయించారు. జగనన్న గోరుముద్ద కోసం రూ.1,200కోట్లు, జగనన్న విద్యాకానుక కోసం రూ. 750 కోట్లు, ఉన్నత విద్యకోసం రూ. 1,973 కోట్లు, వైద్యారోగ్య రంగానికి రూ. 13,840.44 కోట్లు, వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ, మందుల కొనుగోలు కోసం రూ. 2,248.94 కోట్లు, ఆస్పత్రుల్లో నాడు-నేడు కార్యక్రమాల కోసం రూ. 1,535 కోట్లు, కొవిడ్‌పై పోరాటానికి రూ.వెయ్యి కోట్లు, పలాస ఆస్పత్రికి రూ.50 కోట్లు, ఏపీవీవీపీ ఆస్పత్రుల్లో శానిటేషన్‌ కోసం రూ.100 కోట్లు కేటాయించారు. ప్రధానంగా వ్యవసాయం, ఆరోగ్యం, విద్యారంగాలకు కేటాయింపులు పెంచారు. సంక్షేమం కోసం ప్రత్యేక దృష్టి సారించారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి