జనవిజయంఆంధ్రప్రదేశ్లెఫ్ట్ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఏ.పీ లో బ్లాక్ డే నిరసనలు

లెఫ్ట్ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఏ.పీ లో బ్లాక్ డే నిరసనలు

విజయవాడ, మే26(జనవిజయం): కేంద్రం ఏకపక్షంగా తీసుకువచ్చని మూడు వ్యవసాయనల్ల చట్టాలు, విద్యుత్ బిల్లు చట్ట సవరణకు వ్యతిరేకంగా అఖిల భారత రైతు సంఘాల సమన్వయ కమిటీ ఇచ్చిన ‘బ్లాక్ డే’ పిలుపు మేరకు భారీ స్పందన వస్తోంది. ఎపిలో పలుచోట్ల రైతులు నిరసలను దిగారు. లెఫ్ కార్మిక సంఘాల నేతలు ధర్నాలు చేపట్టాయి. ఢిల్లీలో రైతులు చేస్తున్న పోరాటం 6 నెలలు అవుతున్న సందర్భంగా దేశ వ్యాప్తంగా నల్ల జెండాలు ఎగరవేసి నిరసన కార్యక్రమాలు చేపట్టాలని రైతు, కార్మిక, విద్యార్థి, యువజన, మహిళ, ప్రజా సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ లో పలు చోట్ల ఈ నిరసనలు మిన్నంటాయి. కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకుంటున్న నిర్ణయాలను విడనాడాలని లేకుంటే ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని నిరసనకారులు ఆందోళన చేపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ రైతు,ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా జరిగిన కార్యక్రమంలో వివిధ రైతు,కార్మిక, ప్రజాసంఘాలు, పార్టీల నాయకులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ విధానాలకు వ్యతిరేకంగా నల్ల జెండాలు ఆవిష్కరించారు. పలుచోట్ల నల్లజెండాలతో నిపిఎం పార్టీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేసారు. నల్ల చట్టాలకు వ్యతిరేకంగా విశాఖ జివిఎం గాంధీ బొమ్మ దగ్గర అఖిలపక్ష కార్మిక సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ నరసింహ రావు, ఎం జగ్గు నాయుడు పాల్గొన్నారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా.. బ్లాక్ డే నిరసన కార్యక్రమం అనంతలో మున్సిపల్ వర్కర్స్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు నగర ఆఫీస్ బేరర్స్ నాగభూషణం లక్ష్మీనారాయణ, నాగరాజు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఆదినారాయణ, తిరుమలేశు, ఎర్రిస్వామి, వరలక్ష్మి, రామాంజనేయులు, ఆదిశేషు, ప్రభాకర్ తదితరులు పాల్గనడం జరిగింది. వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని తణుకులో నిరసన తెలియజేసారు. బ్లాక్ డే సందర్భంగా కర్నూలులో కష్ణదేవరాయలు సర్కిల్ లో నిరసన ప్రదర్శనలు చేపట్టారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆంధ్రప్రదేశ్ఆరోగ్యంప్రత్యేకంసినిమావాణిజ్యంసాహిత్యంస్పూర్తిఅంతర్జాతీయంవ్యవసాయంప్రముఖులుఆయుర్వేదంపోల్స్అధ్యయనంవిద్యవీడియోలుమంతెన ఆరోగ్య సలహాలుజర్నలిజంవినదగునెవ్వరు చెప్పినఎడిటర్ వాయిస్వికాసంపర్యావరణంపిల్లల పెంపకంవార్త-వ్యాఖ్యనేర వార్తలుఎన్నికలుతెలుసుకుందాంవిజ్ఞానంవీరమాచనేని డైట్ సలహాలుఆధ్యాత్మికంజీవనంన్యాయంసమాజంఆర్ధికంఉపాధిప్రకృతివాతావరణంవార్తలురాజ్యాంగంకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీవినోదంసాంకేతికతఎడిట్ప్రజఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి