జనవిజయంఆంధ్రప్రదేశ్ఏ.పీ లో పదవ తరగతి పరీక్షలపై ఆందోళన

ఏ.పీ లో పదవ తరగతి పరీక్షలపై ఆందోళన

  • టెన్ పరీక్షల నిర్వహణపై తొలగని గందరగోళం
  • అయోమయంలో విద్యార్థులు, టీచర్లు
  • తెలంగాణలో పరీక్షలు లేకుండానే ఫలితాల ప్రకటన

విజయవాడ,మే26(జనవిజయం): కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో.. కర్ఫ్యూ కొనసాగుతున్న వేళ పదో తరగతి పరీక్షలు జరుగుతాయా..? లేక రద్దు చేస్తారా? అనే విషయంలో గందరగోళం తొలగడం లేదు. వీటిపై ప్రభుత్వం నుంచి స్పష్టత లేకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయుల్లోనూ అయోమయం నెలకొంది. వార్షిక పరీక్షలు నిర్వహించి తీరుతామని సిఎం జగన్, మంత్రి ఆదిమూలపు సురేశ్ ఇప్పటికే ప్రకటించారు. తాజాగా పరీక్షలపై జోక్యం చేసుకోవాలని టిడిపి నేత లోకేశ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. మరోవైపు తెలంగాణలో టెన్ ఫలితాలు ప్రకటించి ర్యాంకులు కూడా తెలిపారు. ఇంటర్ అడ్మిషన్ల షెడ్యూల్ కూడా ప్రకటించారు.

దీంతో ఇప్పుడు ఎపిలో పరీక్షలపై విద్యార్థుల్లో టెన్షన్ మొదలయ్యింది. కరోనా ప్రొటోకాల్ ప్రకారం పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి ఆదిమూలపు సురేశ్ పదేపదే చెప్తున్నారు. ఇదే క్రమంలో పది విద్యార్థులకు ఇప్పటి వరకు పాఠశాలలో నిర్వహించిన పరీక్షల మార్కులను అప్లోడ్ చేయాలని ప్రధానోపాధ్యాయులకు ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో పది పరీక్షలపై ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం రోజుకో రకమైన ఆదేశాలు జారీ చేస్తుండటంతో ప్రతి ఒక్కరిలోనూ పరీక్షల నిర్వహణపై అయోమయం నెలకొంది. పరీక్షలు నిర్వహించే ఉద్దేశం ఉన్నప్పుడు, విద్యార్థుల పాత మార్కులను ఎందుకు అప్లోడ్ చేయమంటారని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఫార్మాటివ్ అసెన్మెంట్ విధానాన్ని గత ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ విధానంలో పదో తరగతి విద్యార్థులకు 80 మార్కులకు మాత్రమే ఫైనల్ పరీక్షలు నిర్వహించేవారు. మిగిలిన 20 మార్కులు యూనిట్స్, మూడె నెలలు, అర్ధనంవత్సర పరీక్షల్లో విద్యార్థికి వచ్చే మార్కుల శాతాన్ని బట్టి వాటికి కలిపేవారు. ఆ మార్కుల శాతాన్ని మెయిన్ పరీక్షలకు ముందు అప్లోడ్ చేసేవారు. వీటిని విద్యార్థులు సాధించిన మార్కులతో కలపి, తుది ఫలితాలను విడుదల చేసేవారు. ఇలా అప్ లోడ్ చేసే విధానాన్నే ఫార్మాటివ్ అసన్మెంట్ అంటారు. ఈ విధానం వల్ల కార్పొరేట్ స్కూల్ విద్యార్థులకు 100 శాతం మార్కులు వస్తున్నాయన్న కారణంతో, అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రస్తుత జగన్ ప్రభుత్వం దీనిని పూర్తిగా రద్దు చేసింది.

ఈ విధానం ఆధారంగానే తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది పది పరీక్షలు రద్దు చేయగానే విద్యార్థులకు మార్కులను కేటాయించి, సర్టిఫికేట్లను జారీ చేసింది. రెండేళ్ల క్రితం రద్దు అయిన విధానాన్ని ప్రభుత్వం ఈ నెల 18న తిరిగి తీసుకువచ్చింది. ఈ సంవత్సరం పది విద్యార్థులకు నిర్వహించిన రెండు పరీక్షల మార్కులను అప్లోడ్ చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయం ఉపాధ్యాయులను విస్మయానికి గురిచేసింది. ఒక వైపు పాఠశాలలు ప్రారంభించి విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేయమం టూనే, మరోవైపు మార్కులను అప్లోడ్ చేయమని ఎందుకు అడుగుతున్నారో అర్థం కాని పరిస్థితి ఉపాధ్యాయుల్లో నెలకొంది. ఫార్మాటివ్ అసెన్మెంట్ ను ఈ నెల 18 నుంచి ప్రారంభించి 20 నాటికి పూర్తిచేయాలని ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు అందాయి. కానీ నేటి వరకు దీనికి సంబంధించిన సాఫ్ట్ వేరను మాత్రం ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురాలేదు. అనలు ఈ పక్రియకు సంబంధించి ఎటువంటి లింకను పాఠశాలలకు పంపలేదని సమాచారం. కానీ ప్రస్తుత ప్రభుత్వం అప్లోడ్ పక్రియను ప్రధానోపాధ్యాయులు మాత్రమే చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఎక్కువ మంది ప్రధానోపాధ్యాయులకు ఈ విధానంపై అవగాహన లేకపోవడం, మరికొంతమందికి అసలు కంప్యూటర్ పరిజ్ఞానం లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. మొత్తంగా ఇప్పుడు టెన్ పరీక్షలు జరుగుతాయా లేక రద్దు చేస్తారా అన్నది తెలియక విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో టెన్షన్ పట్టుకుంది.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంవ్యవసాయంప్రముఖులువీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యజర్నలిజంఎడిటర్ వాయిస్వికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంన్యాయంసమాజంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీసాంకేతికతప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి