జనవిజయంఆంధ్రప్రదేశ్ఎపిలో కరోనాతో మరో 96మంది మృతి

ఎపిలో కరోనాతో మరో 96మంది మృతి

  • ఒక్క చిత్తూరు జిల్లాలోనే 14 మంది మృతి
  • నగానికి తగ్గిన టెస్టులు..
  • కేసులు తగ్గించే యత్నమా..?
  • టెస్టులు తగ్గడంతో కొత్త కేసులు తగ్గుదల
  • తాజాగా 12 వేల 994 కొత్త కేసులు నమోదు

అమరావతి,మే24(జనవిజయం): ఏపీలో కరోనా మరణాల ఉధృతి కొనసాగుతోంది. ప్రతిరోజు వందకుపైగా మరణాలు నమోదవుతుండగా సోమవారం కూడా 96 మరణాలు నమోదయ్యాయి. గడచిన 24గంటల్లో 58 వేల 835 మందికి పరీక్షలు చేయగా 12 వేల 994 మందికి కరోనా సోకినట్లు తేలింది. అయితే కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో కొత్తగా 12,994 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 96 మంది కరోనాతో మృతిచెందారు. గడిచిన 24 గంటల్లో 18,373 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 2,03,762 యాక్టివ్ కేసులు, 13,79,837 మంది రికవరీ అయినట్లు బులెటిన్ లో పేర్కొంది. ఏపీలో 24 గంటల వ్యవధిలో 58,835 మందికి ప్రభుత్వం కరోనా పరీక్షలు చేసింది. కరానాతో చిత్తూరు జిల్లాలో 14, కర్నూలు 10, విజయనగరం 10, అనంతపురం 9, తూర్పు గోదావరి 8, విశాఖపట్నం 8, గుంటూరు 7, కృష్ణ 7, నెల్లూరు 7, శ్రీకాకుళం 7, పశ్చిమ గోదావరి 4, ప్రకాశం 3, కడప జిల్లాల్లో ఇద్దరు మృతిచెందారు. కర్ణనాతో జాగ్రత్తగా ఉండాలని విధిగా మాన్కులు, శానిటైజర్లు వాడాలని వైద్యులు సూచించారు. కరోనా పట్ల నిర్లక్ష్యం చేయొద్దని వైద్యులు హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో గడచిన 24 గంటల్లో 96 మంది కరోనా కాటుకు బలయ్యారు. ఇందులో ఒక్క చిత్తూరు జిల్లాలోనే 14 మంది ఉండడం గమనార్హం. కరోనా టెస్టుల విషయంలో ఏపీ ప్రభుత్వం తెలంగాణ బాటలో నడుస్తోంది. తాజాగా విడుదల చేసిన వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ చూస్తే అవుననే అనిపిస్తోంది. ఇది కేవలం ఇవాళ ఒక్క రోజుకే అయితే సాంకేతిక కారణాలు అనజోవచ్చు. లేదంటే తెలంగాణ బాటలో కేసుల సంఖ్య తగ్గించేందుకు టెస్టులు తగ్గించాలని సర్కార్ నిర్ణయించిందన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. ప్రతిరోజు 90 వేలకు పైగా టెస్టులు చేసిన ఏపీ ప్రభుత్వం ఎందుకనో 58 వేల 835 టెస్టులే చేసింది. ఫలితంగా కొత్త కేసులు కూడా తక్కువగా అంటే 12,994 గా నమోదయ్యా యి. మరోవైపు కరోనా మరణాల ఉధృతి తగ్గకపోవడం ఒకింత ఆందోళనకు గురిచేస్తోంది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 14 మంది చనిపోగా కర్నూలు, విజయనగరం జిల్లాలలో 10 మంది చొప్పున, అనంతపురం జిల్లాలో 9 మంది, తూర్పు గోదావరి, విశాఖపట్టణం జిల్లాల్లో 9 మంది చొప్పున, గుంటూరు, కృష్ణ, నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాల్లో ఏడుగురు చొప్పున, పశ్చిమగోదావరి జిల్లా నలుగురు, ప్రకాశం జిల్లాలో ముగ్గురు, కడప జిల్లాలో ఇద్దరు చొప్పున కరోనా నుంచి కోలుకోలేక తుదిశ్వాస విడిచారు. గడచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 18 వేల 373 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఆనుషత్రుల నుంచి డిశ్చార్జి అయి ఇళ్లకు వెళ్లినట్లు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి